Madigadda issue : కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్ల పై విచారణ వాయిదా

ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్‌పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు.

Published By: HashtagU Telugu Desk
Adjournment of hearing on KCR and Harish Rao petition

Adjournment of hearing on KCR and Harish Rao petition

Madigadda issue : కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజలింగమూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్‌.. రాజకీయ ఉత్కంఠ

కేసీఆర్‌, హరీశ్‌రావు, ఇతరుల అవినీతే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు కేసీఆర్, హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ రోజు విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో వారిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందాడని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్‌పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఇకపోతే..మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నిర్మాణంలో అవతవకలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై భూపల్లిపల్లి కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి తాజాగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు.

Read Also: Women Federation : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

 

  Last Updated: 21 Feb 2025, 04:44 PM IST