Site icon HashtagU Telugu

Rahul Gandhi : అదానీ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలి: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi meet Congress MPs on 19

Rahul Gandhi meet Congress MPs on 19

Rahul Gandhi : అదానీ వ్యవహారంపై లోక్‌సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మరోసారి స్పందించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారని.. అదానీ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మోడీ సర్కార్ వెంటనే గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్‌ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయన్ను కాపాడుతున్నారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. అయితే అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా? అని ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని కీలక నేతలు, అధికారులకు అదానీ గ్రూప్ రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చారనే అభియోగాలు దేశంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ విషయం పై బీజేపీ ఎంపీ మహేష్‌ జెఠ్మలానీ మాట్లాడుతూ..రాజకీయ లబ్దికోసమే అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ రాద్దాంత చేస్తుందన్నారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చన ఆరోపణలు గుడ్డిగా నమ్మడం సరికాదన్నారు. భారత్‌ శత్రు దేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూప్‌ ఈ కాంట్రాక్టులు పొందిందని మహేష్‌ జెఠ్మలానీ అన్నారు. భారత్‌ గ్రోత్‌ స్టోరీని అడ్డుకుకే కుట్రతోనే అమెరికా ఈ ఆరోషణలు చేస్తుందన్నారు.

Read Also: Maharashtra : ఇంకా కొత్త ప్రభుత్వం పై రాని స్పష్టత..రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్‌ రౌత్‌