Actor Preity Zinta: రూ.122 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ కేసులో సంచలన విషయం బయటపడింది. బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు (Actor Preity Zinta) బ్యాంకు రుణంపై రూ.1.55 కోట్ల తగ్గింపు ఇచ్చినట్లు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తులో తేలింది. 2011 జనవరి 7న ప్రీతి జింటా బ్యాంకు నుంచి రూ.18 కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో 2013 మార్చి 31 నాటికి ఆమె ఖాతాను ఎన్‌పిఎ (నాన్-పెర్ఫార్మింగ్ యాసెట్)గా ప్రకటించారు. ఎన్‌పిఏ మొత్తం రూ.11.47 కోట్లుగా నమోదైంది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. ప్రీతి జింటా తన రుణం కోసం ముంబైలో ఒక ఫ్లాట్, సిమ్లాలో మరో ఆస్తిని తనఖాగా ఉంచారు. ఆమె మొత్తం ఖర్చు రూ.27.41 కోట్లుగా ఉండగా, నవంబర్ 2012 నాటికి బ్యాంకుకు రూ.11.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2014 ఏప్రిల్ 5న ఆమె మిగిలిన రుణాన్ని తీర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో బ్యాంకు ఆమెకు రూ.1.55 కోట్ల డిస్కౌంట్ ఇచ్చినట్లు వెల్లడైంది.
Also Read: Waqf Board : వర్ఫ్ బోర్డు నాశనం చేసేందుకే సవరణ బిల్లు – అసదుద్దీన్
ఈ కేసులో బ్యాంకు చీఫ్ హితేష్ మెహతాను ఫిబ్రవరి 15న అరెస్టు చేసిన EOW, ఇప్పటివరకు 8 మంది నిందితులను పట్టుకుంది. మెహతాపై బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు మాజీ చైర్మన్ హిరేన్ భాను, ఆయన భార్య గౌరీ భాను వాంటెడ్ నిందితులుగా కొనసాగుతున్నారు. 2010 తర్వాత ఇచ్చిన రుణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుపై ఆంక్షలు విధించగా, డిపాజిటర్ల నిధుల ఉపసంహరణపై నిషేధం కొనసాగుతోంది. ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సినిమాలతో పాటు ప్రీతి ఒక వ్యాపారవేత్తగా కూడా విజయం సాధించింది. ఆమె PZNZ మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ-యజమానిగా ఉంది. 2016లో ఆమె అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా జై, గియా అనే కవలలకు జన్మనిచ్చింది.