WhatsApp Feature – HD Photos : వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది.
ఇప్పటిదాకా మనం వాట్సాప్ లో ఫొటోలను తక్కువ రిజల్యూషన్ లో పంపించే వీలు మాత్రమే ఉంది.
ఇకపై ఫొటోలను “హెచ్‌డీ” క్వాలిటీలోకి మార్చి పంపే వీలును కల్పించడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత.
ఈ ఫీచర్ మరికొద్ది రోజుల్లోనే వాట్సాప్ యూజర్స్ కు అందుబాటులోకి రానుంది.
ఇది రిలీజైన కొన్ని వారాల తర్వాత హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను కూడా సపోర్ట్ చేసేలా వాట్సాప్ ను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
Also read : Infosys STEM Stars : ఆడపిల్లల చదువుకు ఏడాదికి లక్ష స్కాలర్‌షిప్.. ప్రకటించిన ఇన్ఫోసిస్
ఫేస్ బుక్ (మెటా) కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈవివరాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్ తో పాటు వెబ్ వెర్షన్లలోనూ ఈ కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాట్సాప్ లో ఎవరికైనా పంపేందుకు ఒక ఫోటోను సెలెక్ట్ చేసినప్పుడు దాని ఎగువ భాగంలో హెచ్‌డీ (HD) ఐకాన్ కనిపిస్తుందని తెలిపారు. దానిపై క్లిక్ చేసి.. ఫోటోను సెలెక్ట్ చేశాక “ఫోటో క్వాలిటీ” మెనూ కనిపిస్తుందన్నారు. ఇందులో ఫోటో ఎంత రిజల్యూషన్ లో ఉండాలో ఎంపిక చేసుకోవచ్చు. స్టాండర్డ్ క్వాలిటీ 1600 x 1052, HD క్వాలిటీ 4096 x 2692. HD క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇతరులకు పంపే ఫోటో HD క్వాలిటీలోకి(WhatsApp Feature – HD Photos) మారిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారని WABetaInfo తెలిపింది.