Plane crash : సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం

మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
A military plane crashed in Sudan, killing 46

A military plane crashed in Sudan, killing 46

Plane crash : సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. మృతుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.

Read Also: KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్‌

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల సూడాన్‌ పై పట్టు కోసం సైన్యం , పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

మరోవైపు సూడాన్​ మిలిటరీ, రాపిడ్ సపోర్ట్​ ఫోర్సెస్-ఆర్​ఎస్​ఎఫ్​​ దళాల మధ్య ఉద్రక్త పరిస్థితులుు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా పట్టణ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ సామూహిక అత్యాచారాలు, జాతిపరంగా ప్రేరేపితమైన హత్యలు వంటి దారుణాలు ఎక్కువయ్యాయనని ఐక్య రాజ్య సమితి, అంతర్జాతీయ మానవహక్కులు సంఘాలు పేర్కొన్నాయి. ఇవి యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలని అభివర్ణించాయి. ఈ నేరాలు డార్ఫర్​ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపాయి.

Read Also: PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

 

 

  Last Updated: 26 Feb 2025, 04:12 PM IST