Half Eaten Sandwich: సగం తిన్న శాండ్ విచ్ తెచ్చుకున్నందుకు మోడల్ కు ఏకంగా అన్ని లక్షలు ఫైన్?

సాధారణంగా మనం జర్నీ చేసినప్పుడు రకరకాల పదార్థాలను కొనుక్కొని తింటూ ఉంటాం. అయితే ఇలా కొనుక్కునే

  • Written By:
  • Publish Date - July 16, 2022 / 09:30 AM IST

సాధారణంగా మనం జర్నీ చేసినప్పుడు రకరకాల పదార్థాలను కొనుక్కొని తింటూ ఉంటాం. అయితే ఇలా కొనుకుని తినడం ఒక మోడల్ కు శాపంలా మారింది. ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియా కు చెందిన మోడల్ జెస్సికా లీ. ఒక శాండ్ విచ్ ఏకంగా ఆమెకు 1.43 లక్షలు జరిమానా వేయించింది. మోడల్ జెస్సికా లీ ఇటీవలే యూరప్ దేశాలకు వెళ్లి తిరిగి వస్తోంది. దూరం చాలా ఎక్కువ కావడంతో సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంది. ముందు యూరప్ నుంచి సింగపూర్ కు వచ్చింది. అయితే అక్కడ కొద్ది గంటలు ఆగాల్సి రాగా అప్పుడు ఆమె ఆకలి వేయడంతో ఓ పెద్ద శాండ్ విచ్ కొనుక్కుంది.

సగం తినేసి మిగతా సగాన్ని విమానంలో తిందాంలే అని బ్యాగ్ లో పెట్టుకొని విమానం ఎక్కిన తరువాత ఆ మిగతా శాండ్ విచ్ ను తినేయడం మర్చిపోయింది. ఆ తరువాత ఆమె ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో దిగాక కస్టమ్స్ సిబ్బంది సామగ్రి చెక్ చేశారు. తాను తెచ్చుకుంటున్న సామగ్రి వివరాల్లో శాండ్ విచ్ ను పేర్కొనలేదని అందులోని చికెన్, లెట్యూస్ అనేది అలా తేవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ 2,664 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.1.43 లక్షలు. అయితే ఇలా జరిమానా విధించడానికి కూడా కారణాలు ఉన్నాయట. సాధారణంగా దేశాల మధ్య ఆహారం, మాంసం, వివిధ జంతువులు, మొక్కలు, చెట్లకు సంబంధించిన రవాణా పై ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి.

ఏవైనా సూక్ష్మజీవులు వంటివి వ్యాపించకుండా ఉండటం, ఆహార నియమాలు, ఆయా దేశాలకు అవి ప్రమాదకరం అయి ఉండటం, పేటెంట్లు, ఇతర నిబంధనలే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలోనే వీటిని తీసుకెళ్లేందుకు కస్టమ్స్ నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ ఒప్పుకొన్నా వాటికి సంబంధించిన వివరాలను విమానం ఎక్కే ముందుగానే కస్టమ్స్ పత్రాల్లో పేర్కొనాల్సి ఉంటుంది. లేకపోతే జరిమానాలు, జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. జెస్సికాకు ఫైన్ వేసిన కస్టమ్స్ అధికారులు అది చెల్లించడానికి 28 రోజులు గడువు ఇచ్చారు. అయితే తాను ఇటీవలే ఉద్యోగం వదిలేశానని, ఇంత భారీ ఫైన్ కట్టాల్సి వస్తోందని వాపోతూ జెస్సికా లీ ఓ వీడియో విడుదల చేసింది. నేను చేసిన పొరపాటుతో భారీ జరిమానా కట్టాల్సి వస్తోంది. ఇంకెవరూ ఇలా చేయకండి అని తెలిపింది.