Myanmar Earthquake: మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం (Myanmar Earthquake) పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్‌లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 1,670కి చేరింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. మరణాల సంఖ్య 10,000 వరకు చేరవచ్చని అంచనా వేసింది. ఇప్పటికీ నిరంతర భూకంప ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇవి ప్రజలను భయపెడుతున్నాయి. శుక్రవారం రాత్రి 11:56 గంటలకు మయన్మార్‌లో మళ్లీ భూకంప ప్రకంపనలు సంభవించాయి.
స్థానిక సమయం ప్రకారం శుక్రవారం రాత్రి 11:56 గంటలకు ప్రకంపనలు 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపిన ప్రకారం, ఈ భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల జరిగిన విధ్వంసాన్ని ఇట్టే అంచనా వేయవచ్చు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 30 అంతస్తుల భవనం కూలిపోయింది. దీనిలో 43 మంది కార్మికులు చిక్కుకున్నారు. భూకంపం తర్వాత బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మయన్మార్‌లో భూకంపం కారణంగా కనీసం 255 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read: CM Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
భారత్ మయన్మార్‌కు సహాయం కోసం సీ-130 జె విమానం ద్వారా సుమారు 15 టన్నుల సామగ్రిని పంపింది. మయన్మార్‌లో సైనిక పాలన ఉన్నప్పటికీ ట్రంప్ అమెరికా సహాయం చేస్తుందని ప్రకటించారు. చైనా ప్రకారం.. మయన్మార్‌లో వచ్చిన శక్తివంతమైన భూకంపం వల్ల ఎటువంటి చైనీస్ పౌరుడు మరణించలేదని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం దీనిని ధృవీకరించింది. ప్రభుత్వ మీడియా ప్రకారం.. శోధన, రక్షణ ప్రయత్నాలకు సహాయం చేయడానికి ఒక చైనీస్ బృందం మయన్మార్‌కు చేరుకుంది. భూకంప ప్రకంపనలు చైనాలోని యున్నాన్, గ్వాంగ్సీ ప్రావిన్స్‌ల వరకు సంభవించాయి.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం వచ్చిన 7.7 తీవ్రత భూకంపం తర్వాత మయన్మార్‌లో కనీసం 14 సార్లు భూ ప్రకపంనలు సంభవించాయి. ఎక్కువ ప్రకంపనలు పెద్ద భూకంపం తర్వాత కొన్ని గంటల్లో వచ్చాయి. వీటి తీవ్రత 3 నుంచి 5 మధ్యలో ఉంది. అత్యంత శక్తివంతమైన భూకంపం 6.7 తీవ్రతతో పెద్ద భూకంపం తర్వాత సుమారు 10 నిమిషాల్లో వచ్చింది.