Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం

ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
6.2 magnitude earthquake hits Turkey

6.2 magnitude earthquake hits Turkey

Earthquake:  టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల సమయంలో భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు సంస్థ పేర్కొంది. ఈ ప్రకంపనలు దేశ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ స్పష్టంగా వచ్చినట్లు తుర్కియే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంప ప్రభావం తుర్కియేతో పాటు బల్గేరియా, గ్రీస్, రొమేనియా వంటి సమీప దేశాల్లోనూ నమోదైందని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, 2023 ఫిబ్రవరిలో ఆ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ విలయంలో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోనూ ప్రకంపనలు రావడంతో 6వేల మంది చనిపోయారు. ఇక, ఇటీవల మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువక ముందే తాజాగా మళ్లీ భూ ప్రకంపనలతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.

Read Also: Samantha 2nd Wedding : సమంత పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా..?

  Last Updated: 23 Apr 2025, 06:23 PM IST