Budget 2025 : బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు..

ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
5,936 crores for Polavaram in the budget.

5,936 crores for Polavaram in the budget.

Budget 2025 : ఏపీ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేటాయించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ. 54 కోట్లు కేటాయింపులు చేశారు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రతిపాదించారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.3,295 కోట్లు ప్రతిపాదించారు. విశాఖపట్నం పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు.

అలాగే ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు రూ.375 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ఇందుకోసం రూ.240 కోట్లు కేటాయించారు. ఇక, ఈ పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌ హోదా కల్పించిన విషయం తెలిసిందే.

కాగా, 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో కూడా రాష్ట్ర కూటమి కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కూడా రూ. 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

Read Also: Union Budget 2025 : నిర్మలాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు

  Last Updated: 01 Feb 2025, 04:14 PM IST