4B Movement : పురుషులపై మహిళల ప్రతీకారం.. సౌత్ కొరియాలో ‘4బీ ఉద్యమం’ ఎందుకు మొదలైంది ?

ఇంతకీ దక్షిణ కొరియా మహిళలు 4బీ ఉద్యమం(4B Movement) ఎందుకు మొదలుపెట్టారు ?

Published By: HashtagU Telugu Desk
South Korea

South Korea

4B Movement :  అమెరికాలో జరుగుతున్న ‘4బీ ఉద్యమం’ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంపై అమెరికాలోని కొంతమంది మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి వాళ్లే ఇప్పుడు ‘4బీ ఉద్యమం’ చేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు కారకులైన పురుషులపై ‘4బీ ఉద్యమం’తో ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగ వార్నింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి ఈ వినూత్న ఉద్యమం దక్షిణ కొరియాలో మొదలైంది. ఇంతకీ దక్షిణ కొరియా మహిళలు 4బీ ఉద్యమం(4B Movement) ఎందుకు మొదలుపెట్టారు ? ఈ ఉద్యమంతో వాళ్లు ఏం సాధించుకోవాలని భావిస్తున్నారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Shah Rukh Khan : షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. మెసేజ్ పంపిన లాయర్ అరెస్ట్

దక్షిణ కొరియాలో ‘4బీ’ ఎందుకు ?

  • దక్షిణ కొరియా దేశ జనాభా 5.17 కోట్లు. ఇందులో పురుషులు 2.58 కోట్ల మంది, మహిళలు 2.58 కోట్ల మంది ఉన్నారు.
  • దక్షిణ కొరియా భాషలో ‘బీ’ అంటే ‘నో’ అని అర్థం.
  • 4బీ ఉద్యమాన్ని దక్షిణ కొరియా యువతులు, మహిళలు 2019 సంవత్సరంలో మొదలుపెట్టారు.
  • 4బీలు ఏమిటంటే..  బిహాన్ (పెళ్లి చేసుకోం), బీషులాన్ (పిల్లల్ని కనం), బీయోనే (నో డేటింగ్), బీషుకుషు (శారీరక సంబంధానికి నో).
  • దక్షిణ కొరియాలో నేటికీ ప్రతీ రంగంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువ.
  • దక్షిణ కొరియాలో పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు 31 శాతం తక్కువ శాలరీలు ఇస్తుంటారు.
  • ఆ దేశంలో మహిళల ఆయుర్దాయం కూడా తక్కువ.
  • దక్షిణ కొరియాలో గృహ హింస కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. గృహ హింసలో ఏటా ఎంతోమంది మహిళలు చనిపోతుంటారు.
  • ఈవిధమైన పురుషాధిక్యతపై సౌత్ కొరియా మహిళా లోకం 2019లో తిరగబడింది. 4బీ ఉద్యమంతో పురుషులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనింది.
  • దక్షిణ కొరియాతో పోలిస్తే మన భారతదేశంలో మహిళల పరిస్థితి కొంత బెటర్‌గానే ఉంది.
  • అమెరికా మహిళల అబార్షన్ హక్కులను తీసేస్తానని ట్రంప్ అంటున్నారు. అబార్షన్ ద్వారా కడుపులో సజీవంగా ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడం సరికాదని ఆయన వాదిస్తున్నారు. అయితే అబార్షన్ చేయించుకునే  తమ హక్కును రద్దు చేయడం సరికాదని అమెరికాలోని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి.

Also Read :Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని ప్రత్యేకత, పూజా విధానం వివరాలివీ

  Last Updated: 12 Nov 2024, 12:27 PM IST