Site icon HashtagU Telugu

Look Back 2024 : భారత్ సాధించిన గొప్ప విజయాలివే!

2024 Great Achievement Indi

2024 Great Achievement Indi

2024 సంవత్సరం భారతదేశానికి ఎన్నో విజయాలను అందించింది. వాటిలో ప్రధానమైన కొన్నింటిని పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా (Harsh Goenka)X (Twitter) లో పంచుకున్నారు. వీటిలో చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్, భారత దేశం సాంకేతిక పరిజ్ఞానంలో సాధించిన ప్రగతికి ప్రతీకగా నిలిచింది. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏడాది భారత దేశం నిలిచింది. ఇది దేశ ఆర్థిక శక్తిని, అభివృద్ధిని ప్రతిబింబించే కీలక ఘట్టం. పారిశ్రామిక రంగం, స్టార్టప్ యుగానికి వచ్చిన పురోగతి, యువతలో ఉన్న సృజనాత్మకతతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి.

భారతదేశం G20 సమావేశానికి ఆతిథ్యమివ్వడం, అందులో ఉన్న దేశాలకు చక్కటి మార్గదర్శకత్వం అందించడం దేశానికి గౌరవాన్ని తెచ్చింది. వాతావరణ మార్పులు, అభివృద్ధి, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాల్లో భారతదేశం ముందంజలో నిలిపింది. 110కి పైగా యునికార్న్ల అభివృద్ధి, డిజిటల్ ఇండియా విస్తరణ, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వంటి కార్యక్రమాలు భారత సమాజ అభివృద్ధికి పునాదులు వేసాయి. మహిళల రాజకీయం, ఆర్థికరంగాల్లో భాగస్వామ్యం పెరిగింది. ఇది సమానత్వానికి గొప్ప సంకేతంగా నిలిచింది. 2024లో క్రికెట్ ప్రపంచ కప్ విజయం భారత్ క్రీడాకారుల కృషికి ప్రతీకగా నిలిచింది. గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరగడం పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడింది. 2024 సంవత్సరాన్ని భారత విజయం, అభివృద్ధి, ప్రగతిని సూచించే ఏడాదిగా పేర్కొనవచ్చు అని హర్ష చెప్పుకొచ్చారు.

Read Also : Formula E Race Case : కేటీఆర్ కు ఈడీ షాక్