Pakistan: 61 ఏళ్ళ వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 18 ఏళ్ళ యువతి.. ఆమె చెప్పిన కారణం విని నెటిజన్స్ షాక్?

సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య వయసు వ్యత్యాసం కొన్నిసార్లు సమానంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు ఎక్కువగా తక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 07:00 PM IST

సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య వయసు వ్యత్యాసం కొన్నిసార్లు సమానంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు ఎక్కువగా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రేమ పెళ్లిళ్లలో అబ్బాయి వయసు ఎక్కువగా ఉంటే, మరికొన్ని ప్రేమ పెళ్లిళ్లలో అమ్మాయి వయసు ఎక్కువగా ఉంటుంది. వారి ప్రేమ వివాహంలో ఇరువురి మధ్య దాదాపు 15 సంవత్సరాల వరకు తేడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక ప్రేమ వివాహం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి షాకింగ్ కి గురి చేస్తోంది. అమ్మాయి వయసు 18 ఏళ్లు కాగా, అతని వయసు ఏకంగా 61 ఏళ్లు. అంటే ఆ అమ్మాయి తనకంటే 43 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అందులోనూ ప్రేమించి మరి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరి ఆ 18 ఏళ్ల అమ్మాయి ఆ అబ్బాయి ఒకవేళ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆ లవ్ స్టోరీ ఏంటి? అన్న విషయాల్లోకి వెళితే..

61 ఏళ్ల వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి పేరు ఆసియా. పాకిస్తాన్లోని రావల్పిండి ప్రాంతంలో ఆమె నివసిస్తూ ఉంటుంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన రానా శంషాద్ అనే వ్యక్తిని ప్రేమించింది. అనంతరం పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఆమె తన కంటే 43 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. దీనితో స్థానిక న్యూస్ ఛానల్ ఈ దంపతులను సంప్రదించి ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆసియా మాట్లాడుతూ.. రానా శంషాద్ చాలా మంచివాడని.. ఇతరులకు సహాయం చేసే గుణంలో ఆయన ముందే ఉంటారనీ, ఎంతోమంది పేద యువతులకి పెళ్లిళ్లు జరిపించినట్టు ఆసియా వెల్లడించింది.

అయితే అతను చేస్తున్న మంచి పనులు తన దృష్టికి వచ్చి ఆమె ఫిదా అయినట్లు తెలిపింది. ఇదే విషయంపై రానాతో ఆమె రెండు మూడు సార్లు సమావేశమైందట. అలా అతడిపై ఆమెకు ఇష్టం ఏర్పడడంతో అతనికి ప్రేమ గురించి చెప్పి అనంతరం వివాహం చేసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంది అని ఆమె తెలిపింది. రానా శంషాబాద్ తనను బాగా చూసుకుంటున్నాడు అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ ఎంత మంచి వాడైతే మాత్రం తాత వయసు ఉన్న వ్యక్తిని ఏ విధంగా పెళ్లి చేసుకున్నావు.. ఈ పెళ్లిపై మీ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపలేదా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.