Viral Video : పెట్రోలుకు కటకట.. గుర్రంపై జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ

Viral Video : ట్రక్కు డ్రైవర్ల నిరసనతో హైదరాబాద్‌లోని పెట్రోలు బంకుల్లో మంగళవారం నో స్టాక్ బోర్డులు కనిపించాయి.

Published By: HashtagU Telugu Desk
Viral Video

Viral Video

Viral Video : ట్రక్కు డ్రైవర్ల నిరసనతో హైదరాబాద్‌లోని పెట్రోలు బంకుల్లో మంగళవారం నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ఇంధనం స్టాక్ లేక చాలా పెట్రోలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ తరుణంలో జొమాటో డెలివరీ బాయ్ ఒకరు హైదరాబాద్‌లోని  ఇంపీరియల్ హోటల్ పక్కన ఉన్న చంచల్‌గూడ ఏరియా నుంచి గుర్రంపై దౌడు తీస్తూ కనిపించాడు. డెలివరీ చేయాల్సిన ఫుడ్ ఐటమ్‌తో కూడిన సంచిని వేలాడదీసుకొని.. వీపుపై ఎరుపు రంగు జొమాటో బ్యాగును తగిలించుకొని అతగాడు గుర్రంపై దూసుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారి మధ్యలో జొమాటో బాయ్‌ను ఓ వ్యక్తి ఆపి.. ‘‘ గుర్రంపై వెళ్తున్నావేంటి ?’’ అని అడగగా.. ‘‘బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో ఇలా వెళ్లాల్సి వస్తోంది. మూడు గంటల పాటు పెట్రోలు బంకులో క్యూ లైన్‌లో నిలబడినా నాకు పెట్రోలు దొరకలేదు. ఇక గుర్రమే దిక్కయింది’’ అని హిందీలో బదులిచ్చాడు. ఇదంతా వీడియోలో(Viral Video) రికార్డు అయింది.

We’re now on WhatsApp. Click to Join.

మంగళవారం రోజు హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు గుమిగూడడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా నగరంలోని పెట్రోలు బంకుల్లో స్టాక్ అయిపోయింది. హిట్ అండ్ రన్‌ కేసులో శిక్షలకు సంబంధించిన కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చే ముందు ట్రాన్స్‌పోర్టు యూనియన్లతో తప్పకుండా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ట్రక్కర్లు ఆందోళన విరమించారు. భారతీయ న్యాయ సంహిత‌లోని BNS సెక్షన్ 106(2)పై నిరసన వ్యక్తమైంది. గతంలో హిట్ అండ్ రన్ కేసులో రెండేళ్ల జైలుశిక్షే ఉండేది. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో భాగంగా ఆ శిక్షను గరిష్టంగా 10 సంవత్సరాలకు పెంచారు. రూ. 7 లక్షల జరిమానాను కూడా శిక్షలో భాగంగా చేర్చారు.

Also Read: Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ

  Last Updated: 03 Jan 2024, 10:50 AM IST