ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ నేత రోజా

Revanth Reddy  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఢిల్లీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు. రోజాను పలకరించిన రేవంత్ రెడ్డి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో వెంట ఉన్న నాయకులు […]

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy Meets Roja in Delhi

CM Revanth Reddy Meets Roja in Delhi

Revanth Reddy  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఢిల్లీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు.

రోజాను పలకరించిన రేవంత్ రెడ్డి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో వెంట ఉన్న నాయకులు ఏదో ప్రశ్నించగా, తాను పని మీద వచ్చానని ఆమె సమాధానం చెప్పారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని రోజా పలకరించారు.

  Last Updated: 18 Mar 2026, 02:45 PM IST