YS Sharmila: పాలేరు బరిలో షర్మిల, పొంగులేటికి సవాల్

వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

  • Written By:
  • Updated On - October 30, 2023 / 03:34 PM IST

YS Sharmila: కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల భావించింది. అయితే కాంగ్రెస్ అధిష్టాన నుంచి ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో షర్మిల ఒంటరిగా మిగిలింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఆమె అభ్యర్థిత్వాన్ని పెద్ద సవాల్‌గా వైఎస్‌ఆర్‌టీపీ అంచనా వేస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లే పొంగులేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నారని, అయితే ఇప్పుడు షర్మిల పొంగులేటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పీ రాంరెడ్డి తెలిపారు. వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేసి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌టీపీ జెండాను ఎగురవేస్తారని రాంరెడ్డి తెలిపారు. అయితే బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు.

వైఎస్ అభిమానులను ఓటు అడిగిన షర్మిల పాలేరు నియోజకవర్గంలో ఏ మేరకు ప్రభావం చూపించగలదన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పాలేరులో షర్మిళ తెరపైకి రావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యంగా మారనున్నట్లు స్పష్టం అవుతోంది. మరో వైపు సీపీఎంతో కాంగ్రెస్ కు పొత్తు ఖాయం కాని పక్షంలో సీపీఎం కూడా తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే షర్మిల పాలేరు బరిలో నిలుస్తుండటంతో పొంగులేటి ఓటు బ్యాంక్ పై కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ ఎన్నికలో గెలుపొందేందుకు పొంగులేటి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ చట్టం