Site icon HashtagU Telugu

Telangana: అన్నం పెట్టే రైతన్నను మోసం చేసిన పాపం కేసీఆర్‌దే

Telangana

New Web Story Copy 2023 07 18t140639.156

Telangana: తెలంగాణాలో సీఎం కెసిఆర్ రైతులను దారుణంగా మోసం చేశాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. దేశానికి అన్నం పెట్టే రైతును మోసం చేసిన పాపం కేసీఆర్‌దే అంటూ మండిపడ్డారు. తెలంగాణాలో రైతులకు అందాల్సిన ఏ ఒక్క పథకం సరిగా అందలేదని ఆరోపించారు ఆమె. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కెసిఆర్ రైతులను ఏ విధంగా మోసం చేశారో వివరిస్తూ పోస్ట్ పెట్టారు.

రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట,రోజుకో వేషమని ఆరోపించారు వైఎస్ షర్మిల.నమ్మి ఓటేస్తే పథకానికే పంగనామాలు పెట్టి,రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ మాత్రమేనని ధ్వజమెత్తారు. లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలేదంటూ ఫైర్ అయ్యారు. ఇక రైతన్నలకు ఇచ్చిన హామీలను ఆరు నూరైనా, నూరు ఆరైనా నెరవేర్చుతామని నమ్మబలికాడంటూ మండిపడ్డారు.రుణమాఫీపై చేసిన వాగ్దానాలు దొర గడప దాటలే అలాగే రైతులకు రుణాలు మాఫీ కాలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డడు.నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నడు. దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు “డీ ఫాల్టర్” అనే ముద్ర వేసిన పాపం ద్రోహి కేసీఆర్ కే దక్కింది. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇండ్ల మీద పడుతున్నా..రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నా…20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేసినా…రోడ్ల మీద పడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదు.

Also Read: Telangana Congress : కాంగ్రెస్ లో వ‌రుస చేరిక‌లు.. ఆయా జిల్లాలో నేత‌లు క‌లిసి ప‌ని చేసేనా..?

కరోనా పేరు చెప్పి రైతులకు చెల్లించాల్సిన 6 వేల కోట్లకే 60 కష్టాలు చెప్పే దొరలకు.. కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వచ్చినయ్ ? అప్పు తెచ్చిన 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినయ్ ? విలాసాలకు,కొత్త భవనాలకు వందల కోట్లు ఎక్కడియ్ ?35 వేల ఎకరాలు అమ్మిన సొమ్ము ఎక్కడ పెట్టినట్లు ? కరోనా కష్టకాలమే అయితే BRS అకౌంట్లో 12 వందల కోట్లు ఎట్లొచ్చినయ్ ? పథకాలకు నిధులు ఉండవ్ కానీ ..దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటది.దీన్నే అంటారు బంగారు తెలంగాణ.ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే.. తక్షణం 31లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల పేర్కొన్నారు.

Also Read: Delhi Liquor Scam : ఢిల్లీ మ‌ద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘ‌వ‌కు బెయిల్ మంజూరు