Site icon HashtagU Telugu

Telangana Politics: కవితను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్-బీజేపీ నాటకాలు

Telangana Politics

New Web Story Copy 2023 06 24t150322.945

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపి పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నది. విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లకు మించి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై ఎప్పటికప్పుడు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇక తాజాగా ఆమె బీఆర్ఎస్- బీజేపీ లకు లింక్ పెట్టి ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ దాస్తే దాగదని అన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు పార్టీలనుద్దేశించి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కుళ్లిపోయిన కూరగాయలను బంగారు సంచిలో దాస్తే కంపు బయటపడదా ఏంటి అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అలాగే భారాస, భాజపాల అక్రమ మైత్రి కూడా అంతేనని స్పష్టం చేశారు ఆమె. గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతల రాజకీయాలు అంటూ మండిపడ్డారామె.

బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా అని అని సీఎం కెసిఆర్ ని ప్రశ్నించి షర్మిల. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని చెప్పేశారు… మరోవైపు శరద్ పవార్ అయితే ఏకంగా బీజేపీ ,బీఆర్ఎస్ ఒక్కటే అన్నారని ఆమె తెలిపారు.. ఇంకా మీ నాటకాలు దేనికి? తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేసారో చూసాం, మరి బలమైన సాక్షాలున్నాయంటూ కవితను నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పిన సీబీఐ, ఆ తరువాత ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదో, ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని ఆమె మంది పడ్డారు. చివరికి జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేందోనాని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కడిగిన ముత్యమా, లేక మీది కుదిరిన బంధమా?

తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి, కానీ అరెస్టులు ఉండవు. కాళేశ్వరం మీద నేను నిరంతరం పోరాటం చేస్తున్న భాజపా మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలుండవు.. ఇంతలో కేసీఆర్ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి సభాముఖంగా దాడులు చేయడం బంద్ చేస్తారు. ఆయన కుమారుడు ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి అమిత్ షాను కలుస్తాడు. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్ మెంట్ గాలికంటే వేగంగా ఈయనకు దొరుకుతుంది. సమాజ్దార్ కో ఇషారా కాఫీ అన్నట్టు.. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ దోస్తీని బొందపెడతారని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.

Read More: Guntur Karam: యాక్షన్ కు బాబు రెడీ.. ‘గుంటూరు కారం’ షూటింగ్ సెట్ లో మహేష్..!