Site icon HashtagU Telugu

Congress CM Candidate : భట్టి ​, ఉత్తమ్ లే సీఎం పదవికి అర్హులు – వైస్ షర్మిల

Sharmila Cm

Sharmila Cm

తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Election Results) మరికొద్ది గంటల్లో వెల్లడికాబోతున్నాయి. ఈసారి ప్రజలు ఎవరికీ పట్టం కట్టరనేది తెలియనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. దీంతో సీఎం ఎవరు (Congress CM Candidate) అవుతారనేదాని ఫై రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది భట్టి పేరు చెపితే మరికొంతమంది రేవంత్ పేరు చెపుతున్నారు. ఈ తరుణంలో వైస్ షర్మిల సీఎం పదవికి ఎవరు అర్హులు చెప్పేసింది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం మీడియాతో షర్మిల (YS Sharmila) మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. భట్టి విక్రమార్క​, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సీఎం పదవికి అర్హులు. బ్లాక్‌మెయిలర్స్‌ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి ఎవరూ అనేది ఆ పార్టీ నేతలు తేల్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా బైబై కేసీఆర్‌ సూటుకేసును ఆమె ప్రదర్శించారు. గతంలో కూడా రేవంత్ ఫై పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచినా షర్మిల..ఇప్పుడు సీఎం రేస్ అభ్యర్థి విషయంలోనూ ఇన్ డైరెక్ట్ గా రేవంత్ కాడు..కాకూడదని తెలిపింది.

Read Also : Dasoju Sravan: కర్ణాటక నేతలకు తెలంగాణ లో ఏం పని? దాసోజు శ్రవణ్