కాంగ్రెస్ నేత, వైస్ షర్మిల (YS Sharmila) గత కొద్దీ రోజులుగా వరుస పెట్టి రాజకీయ నేతలను కలుస్తూ..తన కొడుకు (Raja Reddy) వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డికి జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుండగా.. ఇందుకు షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలను షర్మిల పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా సీఎం రేవంత్ ను కలిసి ఆహ్వానించగా..తాజాగా ఈరోజు ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలిసింది. భట్టి అన్నా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. డిప్యూటీ సీఎం కావడం వెరీ వెరీ హ్యాపీగా ఉందంటూ కంగ్రట్యూలేషన్ అన్నారు. ఈ నెల 18న నా తనయుడు రాజారెడ్డి పెండ్లి కావున తప్పకుండా రావాలని వివాహ పత్రికను అందజేసి ఆహ్వానించారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.
ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్న షర్మిల..రీసెంట్ గా కాంగ్రెస్ లో తన YSRTP ని విలీనం చేసి..తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఈమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకోబోతుంది.
Read Also : Dorababu Pendem : వైసీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో పిఠాపురం ఎమ్మెల్యే..?