Site icon HashtagU Telugu

Telangana: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన కేసీఆర్

Telangana

New Web Story Copy 2023 07 20t180048.245

Telangana: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యశ్రీగా మార్చాడని ఆరోపించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో మహానేత పథకాలు అద్భుతమని కపట ప్రేమ చూపించి ఆయన తీసుకొచ్చిన పథకాలను గాలికొదిలేశాడని సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు షర్మిల. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారు.ఏటికేటా బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే కేసులు పట్టకుండా చేశారు. కంటికి పంటికి జబ్బు చేస్తే ఢిల్లీకి,కార్పొరేట్ దవాఖానకు పరుగులు పెట్టే దొర.. పేదోడికి దక్కాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని అందకుండా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

తొమ్మిదేండ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్ ది. కరోనాలాంటి విపత్కర పరిస్థితిలోనూ బకాయిలు చెల్లించకుండా వేలాది మంది పేదల చావులకు ప్రత్యక్ష కారకుడు కేసీఆర్. ఇన్నాళ్లు పథకంపై సవతి తల్లి ప్రేమ చూపిన దొర గారికి ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆరోగ్యశ్రీ ఇయ్యకుంటే ఎన్నికల్లో ప్రజలు తన్ని తరుముతరని అర్థమైంది.అందుకే 2లక్షల నుంచి ప్రీమియాన్ని రూ.5 లక్షలకు పెంచిండని ఆరోపించారు వైఎస్ షర్మిల. పని చేయని పథకానికి అంకెల్లో ప్రీమియం పెంచి ఏదో ఉద్దరించినట్లు ఇప్పుడు బిల్డప్పులు ఇస్తున్నరు.

అయ్యా కేసీఆర్ గారు.. మీ ఎన్నికల జిమ్మిక్కులు, నక్క తెలివితేటలు ఇప్పటికైనా పక్కన పెట్టండి. ప్రజల ప్రాణాలతో నీచ రాజకీయాలు ఆపండి.తక్షణం ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయండి. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించండి. ఇచ్చిన మాట ప్రకారమైనా 5 లక్షల ప్రీమియాన్ని ఆపకుండా అమలు చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Read More: Upasana : తల్లి అయ్యాక ఉపాసన ఫస్ట్ బర్త్ డే ను చరణ్ ఎలా జరపబోతున్నాడో తెలుసా..?