Site icon HashtagU Telugu

YS Sharmila: అస్వస్థతకు గురైన వైఎస్​ షర్మిల

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు షర్మిల పర్యటన చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని తుమ్మలపల్లిలో ఆమె రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెకు ప్రధమ చికిత్స చేయడంతో కాసేపటికి తేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తెలంగాణాలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తీరిక లేకుండా పలు సమస్యలపై ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. తాజాగా పేపర్ లీకేజి అంశంలో షర్మిల దూకుడుగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పంట చేతికొచ్చే సమయానికి ఈ అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని గోడు వెల్లబోసుకుంటున్నారు. రైతులని పరామర్శించేందుకు వరుస పర్యటనలు చేపట్టారు షర్మిల. తీరికలేకుండా పలు జిల్లాలో తిరుగుతున్నారు. వందలాది మంది రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

అకాల వర్షాలతో నిండామునిగిన రైతుల్ని ఆదుకోవాలంటూ షర్మిల అధికార పార్టీని డిమాండ్ చేశారు. రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా పర్యటనకు ముందు ఆమె నిన్న జనగాం జిల్లాలో పర్యటించారు. అక్కడ మామిడి, వరి రైతులను పరామర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.

Read More: Mumbai Indians: ముంబై జట్టులోకి క్రిస్ జోర్డాన్