అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి (Revanth Reddy) దొంగ అని సుప్రీం కోర్టే చెప్పింది..కేస్ డిస్మిస్ కోసం కోర్టుకెళ్తే రేవంత్ రెడ్డి దోషి అని న్యాయస్థానం చెప్పింది..అలాంటి దొంగలు అన్ని పార్టీలలో ఉన్నారు..ఆ దొంగలు ఎప్పుడు సీఎంలు కాలేరంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
YSRTP పార్టీ స్థాపించిన దగ్గరి నుండి కూడా షర్మిల ఎన్నికల్లో సత్తా చాటాలని , రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని కలలు కన్నది. కానీ ప్రస్తుత రాజకీయ పార్టీలతో పోటీపడలేక..ఏకంగా ఎన్నికల బరి నుండే తప్పుకొని , కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపింది. ఇక ఇప్పుడు ఆ పార్టీ చీఫ్ ఫైనే సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను కాంగ్రెస్ లోకి వెళితే కొద్దిమందికి పదవి గండమని.. అందుకే తనను అడ్డుకున్నారని ఆరోపించింది. రేవంత్‌రెడ్డిని రేటెంతరెడ్డి తాను అనలేదని.. సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ వాళ్లే విమర్శించారన్నారు. ప్రజల కోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఎవరో వచ్చి మాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
అలాగే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishnareddy) సైతం షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు సజ్జల సంబంధం లేదని అన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆయన మళ్లీ ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. మళ్లీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ రోడ్లు, ఏపీలో సింగిల్ రోడ్లు అన్నప్పుడు సజ్జల మాట్లాడితే బాగుండేదన్నారు. సజ్జలకు అయినా.. జగన్‌కైనా ఒకటే సమాధానమని షర్మిల ఘాటుగా స్పందించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక సీఎం కేసీఆర్ ఫై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekhar Reddy) బతికి ఉన్న రోజుల్లోనే అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. రూ.38 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని … మొత్తం 16.48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ జరిగిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 7 వేల కోట్లను ఖర్చు చేశారన్నారు. అయితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా రీడిజైన్ చేశారన్నారు. నా మెదడు, నా రక్తం, నాశ్రమతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశానని ఆ సమయంలో కేసీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. తీరా ప్రాజెక్టు ఇప్పుడు చూస్తే కుక్క తోక తగిలినా కూలిపోయే మాదిరిగా ఉందని ధ్వజమెత్తారు. గతేడాది అన్నారం, కన్నేపల్లి పంప్ హౌజ్ లు మునిగిపోయాయన్నారు. ఇందుకు కారణం కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌజ్ లను నిర్మించడమేనని ఆరోపించారు.
Read Also : Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పోటీ.. అభ్యర్థి ఎవరో తెలుసా?