Site icon HashtagU Telugu

Lover : ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..ఆత్మ హత్య చేసుకున్న యువకుడు

Lovers Suicide

Lovers Suicide

ఖమ్మం జిల్లాలో ఓ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన శ్రీను (Srinu) అనే యువకుడు (వయస్సు 24) ప్రేమించిన యువతి మాట్లాడడం లేదన్న కారణంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ బాధను తట్టుకోలేకపోయిన శ్రీను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

X Prices: ఎక్స్ యూజ‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన ప్రీమియం ప్లాన్ ధ‌ర‌లు!

శ్రీను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతను గత కొంతకాలంగా చింతకాని మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించేవాడు. వారి మధ్య బంధం మంచి స్నేహంతో ప్రారంభమై ప్రేమగా మారినట్టు సమాచారం. కానీ ఇటీవల శ్రీను పై కోపం పెంచుకున్న ఆమె అతనితో మాట్లాడడం మానేసింది. దీంతో భరించలేకపోయిన శ్రీను తీవ్ర ఒత్తిడికి లోనై జీవితాన్ని ముగించుకున్నాడు.

ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలో ఎదురయ్యే సమస్యలను ఓర్పుగా ఎదుర్కోవాలని, చిన్న చిన్న విభేదాలకు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన యువతకు గుణపాఠంగా మారాలని పెద్దలు పేర్కొంటున్నారు.