తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త శకం ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది వ్యవధిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో 2,532 మంది యువతకు ఉద్యోగ నియామన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “గత పాలకుల నిర్లక్ష్యంతో వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అంధకారంలో చిక్కుకున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో కొత్త దారులు తీసుకొచ్చింది” అని స్పష్టం చేశారు.
Telangana Assembly : మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు..19న బడ్జెట్
“గత 12 ఏళ్ల పాలనలో ప్రభుత్వం సరైన ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టలేదు. టీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగ యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. కానీ నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి మేము కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ భృతి మోసంగా మారిందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
CM Chandrababu : తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ : సీఎం చంద్రబాబు
మేము ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం అని సీఎం హామీ ఇచ్చారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.