తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్…వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ బస్సు కారణంగా డ్రైవర్లు , కండక్టర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. అవసరం ఉన్న లేకపోయినా ప్రయాణం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ లోడ్ కారణంగా అనేక చోట్ల బస్సులు ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల బస్సు చక్రాలు ఊడిపోతున్నాయి. తాజాగా ప్రయాణికుల రద్దీ తో మీము బస్సు నడపలేం అంటూ అంటూ డ్రైవర్లు రోడ్ల ఫై బస్సులను నిలిపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
సిరిసిల్ల బస్సు వరంగల్ వెళ్తుండగా హుజూరాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. డ్రైవర్ చెప్పినా బస్సు దిగలేదు. ఓవర్ లోడ్‌తోనే బస్సును బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చి నడిరోడ్డుపైనే నిలిపారు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని చెప్పారు. ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు భూపాలపల్లికి వెళ్లేందుకు మధ్యాహ్నం ప్రయాణికులతో తాడ్వాయికి చేరుకుంది.
అక్కడ ఒకే బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కారు. దీంతో కండక్టర్ కొంత మంది బస్సు దిగాలని, వెనుక వచ్చే బస్సులో ఎక్కాలని సూచించారు. తన మాటను వినకుండా కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల మాటలకు తాళలేక డ్రైవర్ బస్సు దిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని వెళ్లేందుకు యత్నించారు. బస్సులో ఉన్న పురుష ప్రయాణికులు డ్రైవర్‌ను సముదాయించడంతో సుమారు 60 మంది ప్రయాణికులు బస్సు దిగారు. ఇలా ఒకటి రెండే కాదు ప్రతి రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Read Also : 2024 Hero Glamour: మార్కెట్‌లోకి అప్డేట్ చేసిన గ్లామర్ 125 బైక్.. ధర ఎంతంటే..?