Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, , మంచిర్యాల, నిజామాబాద్, , నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయన్నారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వానలు కురుస్తాయని.. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈరోజు ఏపీ అంతటా మబ్బుగా ఉండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గురువారం రాత్రి నుంచే కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకూ ఈ వానలు (Rain Alert) ఇలాగే కురుస్తాయి. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని అధికారులు అంటున్నారు.