Palakurthi : 40 ఏళ్ల పొలిటికల్ నేతను ఓడించిన యువ కెరటం..

మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న దయాకర్ రావు ..26 ఏళ్ల యువకెరటం చేతిలో ఓడిపోయారు

Published By: HashtagU Telugu Desk
Errabelli

Errabelli

రాజకీయాల్లో సత్తా చాటాలంటే రాజకీయ అనుభవం..వయసు అవసరం లేదు..ప్రజలు ఏంకోరుకుంటున్నారో..? వారికీ కావాల్సింది ఏంటో తెలుసుకొని..వాటిని ఇస్తామని హామీ ఇస్తే చాలు..వారే విజయాన్ని చేకూరుస్తారు. తాజాగా పాలకుర్తి (Palakurthy ) లో అదే జరిగింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ను చిత్తుగా ఓడించి సత్తా చాటింది యువ కెరటం యశస్విని రెడ్డి (Yashaswini Reddy). 26 ఏళ్ల ఈ యువకెరటం..మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టి..ఏకంగా అధికార పార్టీ మంత్రి…40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించి ఇప్పుడు యువతకు ఆదర్శంగా నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రి గా ప్రజలకు సుపరిచితుడు. అయినప్పటికీ తన ప్రత్యర్థి 26 సంవత్సరాల యశస్విని ముందు నిలబడలేకపోయాడు. టికెట్ (Palakurthy ) ఖరారైన దగ్గరి నుండే ఎర్రబెల్లి నియోజకవర్గంలో ప్రచారం స్పీడ్ చేసారు. ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ప్రజల నుండి ఆయన తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారింది. అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయ్యింది.

తొలి నుంచి హోరాహోరీగా తలపడిన యశస్విని రెడ్డి మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇలా మొదటి నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా దయాకర్ రావు పోటీ ఇవ్వలేక.. చివరికి ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న దయాకర్ రావు ..26 ఏళ్ల యువకెరటం చేతిలో ఓడిపోయారు.

Read Also : Telangana Election Results : తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు..జగన్ లో భయం మొదలైందా..?

  Last Updated: 04 Dec 2023, 11:17 AM IST