Site icon HashtagU Telugu

YS Sharmila: పోలీసులపై దాడి.. వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే!

Sharmila

Sharmila

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన షర్మిల (YS Sharmila) అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. లోటస్ పాండ్ వద్ద షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై (Police) షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు అమెను అరెస్ట్ (Arrested) చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులతో దురుసుగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో షర్మిల తెలిపింది.

సిట్ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ (TSPSC ) దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం భాధ్యతగా ఫీలయ్యానని అన్నారు. సిట్ ఆఫీస్ కి వెళ్ళడానికిఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని షర్మిల తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ధర్నాకు పోలేదు. ముట్టడి అని పిలుపు నివ్వలేదు. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?’’ అని (YS Sharmila) ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల (YS Sharmila) బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, షర్మిల మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: Viveka Murder Case: వ‌ర్మ ‘నిజం’లో వివేకా హ‌త్య‌!

Exit mobile version