తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ (KTR) తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) పోస్ట్‌లో తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ర్యాంకింగ్స్‌పై ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Govt)పై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. 2022కి సంబంధించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (MInister Piyush Goyal) ప్రకటించారు. ఆ ర్యాంకుల ప్రకారం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో చివరికి పడిపోయింది.
కేటీఆర్ ఈ ర్యాంకింగ్స్ పై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ ర్యాంకులు పతనమయ్యాయని, కొత్త ప్రభుత్వ పనితీరులో నైపుణ్యం లేకపోవడమే కారణమని ఆరోపించారు. అయితే ఈ ర్యాంకింగ్స్ 2022కి సంబంధించినవని, ఆ సమయంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉందని సపోర్టర్లు గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ మీడియా, కమ్యూనికేషన్ డైరెక్టర్ శ్రీరామ్ కార్రీ కేటీఆర్‌పై ప్రతిదాడి చేస్తూ, “ఈ ర్యాంకింగ్స్ 2022కి చెందినవి. 2024 ర్యాంకులు ఇంకా రాలేదు. 2022లో సీఎం ఎవరు? పరిశ్రమల మంత్రి ఎవరు? ఎలాంటి పని చూపించారు?” అని ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్, కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్‌ఏపీ) ద్వారా ప్రతి ఏడాది ప్రకటించబడుతుంది.
Read Also : Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క