Future CM Batti : పీపుల్స్ మార్చ్ కు 100 రోజులు, కాంగ్రెస్ సంబురాలు

సామాన్యుల క‌ష్టాలను తెలుసుకుంటూ తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క (Future CM Batti) నిబ‌ద్ధ‌తతో కూడిన పాద‌యాత్ర చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 23, 2023 / 03:56 PM IST

సామాన్యుల క‌ష్టాలను తెలుసుకుంటూ తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క (Future CM Batti) నిబ‌ద్ధ‌తతో కూడిన పాద‌యాత్ర చేస్తున్నారు. మండుటెండ‌లో ఆయన చేస్తోన్న పాద‌యాత్ర‌కు శుక్ర‌వారంతో 100 రోజులు పూర్త‌య్యాయి. ఆ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. స్వ‌ర్గీయ వైఎస్ పాద‌యాత్ర‌ను గుర్తు చేసేలా భ‌ట్టీ విక్ర‌మార్క చేస్తోన్న పాద‌యాత్ర నిరుపేద‌ల్ని ఆక‌ట్టుకుంది. నిజ‌మైన పాద‌యాత్ర‌ను చేస్తూ ప్ర‌జాద‌ర‌ణ పొందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయ‌న యాత్ర‌కు అండ‌గా నిలిచింది. సీనియ‌ర్లంద‌రూ ఐక్యంగా భ‌ట్టీ యాత్ర‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు సైతం ఆయ‌న‌కు ఆశీస్సులు అందిస్తూ ప్రోత్స‌హిస్తున్నారు.

భార‌త్ జోడో యాత్ర‌ను ఆద‌ర్శంగా తీసుకున్న భ‌ట్టీ  పీపుల్స్ మార్చ్(Future CM Batti) 

భార‌త్ జోడో యాత్ర‌ను ఆద‌ర్శంగా తీసుకున్న భ‌ట్టీ (Future CM Batti) పీపుల్స్ మార్చ్ పేరుతో పాద‌యాత్ర‌కు వంద రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టారు. సుమారు 1150 కిలోమీటర్ల పాద‌యాత్ర 100 రోజుల్లో పూర్త‌యింది. వందో రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొన‌సాగుతోంది. ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభ‌మైన పీపుల్స్ మార్చ్ 15 జిల్లాల్లోని 32 శాసనసభ నియోజకవర్గాల చుట్టేసింది. ప్ర‌స్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలం వ‌ద్దకు పాదయాత్ర చేరుకుంది. వ‌డ‌దెబ్బ‌కు నాలుగు రోజుల క్రితం భ‌ట్టీ విక్ర‌మార్క్ అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు రెండురోజులు పాదయాత్ర వాయిదా ప‌డ‌గా తిరిగి శుక్ర‌వారం కేతేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హాలో భ‌ట్టీ పాద‌యాత్ర

పీపుల్స్ మార్చ్ 100వ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంది. పీపుల్స్ మార్చ్ నేతల మధ్య ఐక్యత తెచ్చింది. హైకమాండ్ ను ఈ యాత్ర‌ను గ‌మ‌నించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు యాత్రలో పాల్గొన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. పాద‌యాత్ర సంద‌ర్భంగా మంచిర్యాల‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన (Future CM Batti) బహిరంగ స‌భ‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. వాటికి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజ‌ర‌య్యారు. మంచిర్యాల స‌భ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రులు హాజ‌రు కావ‌డం విశేషం.

ఎండ‌లు మండిపోతోన్న స‌మ‌యంలో అచ్చ తెలుగువాడి రూపంలో అడుగులు

ఖ‌రీదైన బ‌స్సుల్లో (కార్వ‌న్) సేద‌తీరుతూ చేసే పాద‌యాత్రల‌ను చేస్తున్నాం. ఖ‌రీదైన కార్వ‌న్ల‌ను త‌యారు చేసుకుని రాజ్యాధికారం ల‌క్ష్యంగా చేసే పాద‌యాత్రలు వేరు. సామాన్యుల బాధ‌లు తెలుసుకుంటూ మండుటెండ‌లో చేసే పాద‌యాత్ర‌ను తొలిసారి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేశారు. ఆయ‌న 2004 ఎన్నిక‌ల‌కు ముందు ఉమ్మ‌డి రాష్ట్రం క‌రువు నెల‌కొని ఎండ‌లు మండిపోతోన్న స‌మ‌యంలో అచ్చ తెలుగువాడి రూపంలో అడుగులు వేశారు. ఆనాటి పాద‌యాత్ర ఒక చ‌రిత్ర‌. దాన్ని ఎవ‌రూ చెరిపేయ‌లేరు. ఇంచుమించు అదే త‌ర‌హాలో భ‌ట్టీ(Future CM Batti) పాద‌యాత్ర కొన‌సాగింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సేద తీరుతూ ముందుకు సాగారు. ఎలాంటి ఆర్భాటాల‌కు వెళ్ల‌కుండా పీపుల్స్ మార్చ్ కొన‌సాగుతోంది.

కాబోయే సీఎం అనే సంకేతాలు(Future CM Batti) 

స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేసిన త‌రువాత చాలా మంది పాద‌యాత్ర‌లు చేశారు. కానీ, ఆ త‌ర‌హా యాత్ర‌ల‌ను చూడ‌లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉమ్మ‌డి ఏపీలో పాద‌యాత్ర చేశారు. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విడిపోయిన ఏపీ లో పాద‌యాత్ర చేయ‌డం చూశాం. ఇప్పుడు లోకేష్ యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి రైతు పాద‌యాత్ర చేశారు. ఆ త‌రువాత పీసీసీ చీఫ్ హోదాలో కొన్ని చోట్ల పాద‌యాత్ర చేయ‌డాన్ని చూశాం. ఖ‌రీదైన ఏసీ కార్వ‌న్ల‌లో సేద‌తీరుతూ పాద‌యాత్ర‌ల‌ను వాళ్లు చేశారు. ఆనాడు వైఎస్ త‌ర‌హాలో ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ను భ‌ట్టి విక్ర‌మార్క్ (Future CM Batti) చేస్తున్నారు.

 Also Read : T Congress : `విక్ర‌మార్క్`కాంగ్రెస్ మార్చ్! AICC ఆశీస్సులు!!

సీఎల్పీ నేత‌గా భ‌ట్టీ  చేస్తోన్న పోరాటం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ల‌ను సైతం ముగ్దుల్ని చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న వేస్తోన్న అడుగులు ప్ర‌శంస‌నీయం. అందుకే, కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు సైతం భ‌ట్టీకి అండ‌గా నిలిచారు. అప్ప‌ట్లో వైఎస్ ఏ త‌ర‌హా మ‌ద్ధ‌తు అధిష్టానం నుంచి ల‌భించిందో, అదే ఇప్పుడు భ‌ట్టికి ల‌భిస్తోంది. కాబోయే సీఎం అనే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయి. ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేస్తాన‌న్న కేసీఆర్ నినాదాన్ని ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెర‌వేర్చ‌బోతుందని సర్వ‌త్రా వినిపిస్తోంది. పాద‌యాత్ర సంద‌ర్భంగా న‌ల్గొండ‌లో స‌భ జ‌ర‌గ‌నుంది. అదే త‌ర‌హాలో ముగింపు స‌భ ఖ‌మ్మం వేదిక‌గా ఉండనుంది. ఆ వేదిక‌పై భ‌ట్టీ కాబోయే సీఎం (Future CM Batti) అనే సంకేతాలు బ‌లంగా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, రాహుల్, ప్రియాంక తో పాటు సోనియా కూడా ఖ‌మ్మం స‌భ‌కు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.

Also Read : T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు