Site icon HashtagU Telugu

Mallareddy : జుంబా సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన మంత్రి మల్లన్న

Mallareddy Dance

Mallareddy Dance

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలాగా ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తుంటాడు. సభ ఏదైనా అతిథులను హుషారెత్తించే మాటలు, చేతలతో ఆకట్టుకోవడం ఆయన నైజం. మల్లారెడ్డి స్పీచ్ అన్న , స్టెప్స్ అన్న చాలామంది పడి చస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్ అవుతుంటాయి. తాజాగా జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి 70 ఏళ్ల వయసులో యువకుడిలా స్టెప్పులు వేసి అలరించాడు.

గతంలో కూడా సంక్రాంతి వేడుకల్లో మల్లారెడ్డి యూనివర్సిటీల కైట్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది యువకులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, సిద్దు చేసిన ప్రసంగాలు విద్యార్థులను ఆకట్టుకొన్నాయి. సిద్దూను ఉత్సాహ పరుస్తూ డీజే టిల్లూ టైటిల్ సాంగ్‌పై స్టెప్పులు వేశారు. సిద్దూ, మల్లారెడ్డి వేసిన స్టెప్పులకు వేదిక దద్దరిల్లింది. మల్లారెడ్డి వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పుడు మరో సారి డీజే సాంగ్ కు మల్లన్న అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించాడు.

Read Also : BRS Minister: అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు ఎత్తిపోతలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోంది: నిరంజన్ రెడ్డి

కూకట్ పల్లి IDL వద్ద మల్లారెడ్డి సంస్థల ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే (World Heart Day) సందర్బంగా ఏర్పాటు చేసిన 5K రన్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి జుంబా సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించాడు. జుంబా సాంగ్ తో పాటు డీజే టిల్లు సాంగ్ కు కూడా యువత తో సమానంగా స్టెప్స్ వేసి వారిలో ఉత్సహం నింపాడు.