Site icon HashtagU Telugu

Telangana Free Bus Travel Scheme : ఉచిత బస్సు ప్రయాణం..మాకొద్దంటున్న మహిళలు

Womens

Womens

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్..రెండు రోజుల్లోనే కీలక రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వాసం నింపింది. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) పట్ల మొదట్లో హర్షం వ్యక్తం చేయగా..ఇప్పుడు మాకు వద్దంటున్నారు. పథకం ప్రవేశ పెట్టగానే మహిళలు (Womens) పెద్ద ఎత్తున ప్రయాణం చేసి ..తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కానీ రాను రాను మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తూ..తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

బస్సులు ఎక్కువగా లేకపోవడంతో మహిళలు, కాలేజీ అమ్మాయిలు ప్రతి రోజు ఫుడ్ బోర్డు చేస్తూ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో టెన్షన్ మొదలైంది. ఇంటి నుండి వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునేవరకు వారంతా ఆందోళన చెందుతున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు అత్యధికంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సులో కెపాసిటీకి మించి జనం ఎక్కడంతో కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు, యువతులు కనీసం నిల్చోడానికి కూడా కాళీ ఉండటం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ యువతి ఉచిత బస్సు ప్రయాణంతో సరిపడా బస్సులు వేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ నడిరోడ్డుపై రోదించింది. కాలేజీ యువతి ఏడుపుతో ఆర్టీసీ బస్ డ్రైవర్ కొద్దిసేపు బస్సును నిలిపివేశాడు. ఆ తర్వాత అలాగే బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. అది గమనించి ఓ యువకుడు అదంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు విషయంలోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి పెగడపల్లికి వెళ్లాల్సిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో సుమారు 100 మంది ప్రయాణికులు ఇరుక్కుని మరీ ఎక్కారు. మగవాళ్లు, కాలేజీ అబ్బాయిలతో పోటీ పడి బస్సుల్లో ఎక్కిన వాళ్లు కాకుండా బస్సులో ఖాళీ లేకపోవడంతో బస్టాండ్ లోనే కొందరు ఉండిపోయారు. రాత్రి పడుతుంటే ప్రయాణికులకు సరిపడా బస్సులు నడపాలని లేదంటే ఈ రాత్రి వేళ మేం ఇంటికి ఎలా వెళ్లాలని ఓ యువతి నడిరోడ్డుపైనే ఏడ్చేసింది. అలాగే మరికొంతమంది మహిళలు సైతం మాకు ఈ ఫ్రీ సౌకర్యం వద్దని..ఫ్రీ అని చెప్పి..దానికి తగ్గ బస్సులు పెట్టడం లేదని..ఒక్క బస్సులో వందకు పైగా ప్రయాణం చేస్తూ..జరగరానిది జరిగితే ఏమైనా ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.మరి ఈ సంఘటనపై ఆర్జీసీ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Also : Palnadu : టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసిన వైసీపీ శ్రేణులు..?

Exit mobile version