Site icon HashtagU Telugu

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి

Nagar Kurnool

Nagar Kurnool

Nagar Kurnool: ఎండ వేడిమితో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలను వర్షాలు కలకరిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో వర్షాలు కురుస్తుండగా, మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ రోజు శుక్రవారం కూడా వర్షాలు పడ్డాయి.

We’re now on WhatsAppClick to Join

నాగర్ కర్నూల్ లో శుక్రవారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అతలాకుతలం అయిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా కేంద్రంలోని పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శ్యామలమ్మ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా వర్షం కురుస్తుండటంతో తల దాచుకునేందుకు పొలంలో వేపచెట్టు కింద కూర్చొని ఉండగా పిడుగుపాటుకు గురై మృతి చెందింది. మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Sweating in Summer : చెమటలు ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి మంచిదేనా ?