Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతుందా ? దీనిపై జరుగుతున్న ప్రచారం నిజమేనా ? అనే దానిపై అంతటా డిస్కషన్ జరుగుతోంది. అల్లు అర్జున్ విషయంలో చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని.. మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీపై తమకు ఎలాంటి అక్కసు లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ పూర్తిస్థాయిలో సహకరిస్తామని సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. సినిమా రంగానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నుంచి పూర్తి మద్దతును అందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్(Film Industry) తెలిపారు. ఏపీకి సినీ పరిశ్రమ వెళ్లిపోతుందన్న ప్రచారాన్ని వారు ఖండించారు. తమకు సినీ పరిశ్రమపై కోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
Also Read :Bill Clinton Hospitalised : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత.. ఆయనకు ఏమైందంటే..?
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో సినీ ఇండస్ట్రీ విస్తరణకు తన వంతుగా సహకరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి స్వాగతం పలికేందుకు ఏపీ రెడీగా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి సినీ రంగానికి వస్తున్న ఆఫర్లను నెగెటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ వ్యవహారం వల్ల ఈ ఆఫర్లు రావడం లేదు.
Also Read :Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్
తెలుగు సినీ ఇండస్ట్రీ వారు ముందుకొచ్చి విశాఖపట్నంలో స్టూడియోలను పెట్టుకోవాలని గతంలో కూడా ఏపీ ప్రభుత్వాల నుంచి ఆఫర్లు వచ్చాయి. నవ్యాంధ్ర డెవలప్‌మెంట్‌ను కోరుకునే కోణంలోనే ఈ ఆఫర్లు వచ్చాయి. అంతేతప్ప తెలంగాణకు పోటీగా ఆ ఆఫర్లు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో పాతుకుపోయింది అనే విషయం నిజం. ఏదో ఒకటి, రెండు ఘటనల కారణంగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌ను వీడే అవకాశాలు లేవు. ఇక సినిమా షూటింగ్‌ల విషయానికొస్తే.. ప్రపంచంలో లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడికి చిత్ర యూనిట్లు వెళ్తుంటాయి. దానికి ఎలాంటి పరిమితి లేనే లేదు. ఈ అంశంపై రాద్ధాంతం, రాజకీయం సరికాదు.