Site icon HashtagU Telugu

Congress : టీపీసీసీ కూర్పులో సామాజిక న్యాయం జరుగుతుందా?

Tpcc Cng

Tpcc Cng

తెలంగాణలో ఇటీవల ముగిసిన కుల గణన (Caste Census) నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించినట్లు “ఎంత జనాభా ఉంటే అంత హక్కు” సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల కూర్పు ఉండాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణనను పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపిన నేపథ్యంలో, టీపీసీసీ కమిటీలలోనూ అదే నమూనా అమలు చేస్తారా అన్న ప్రశ్న ఉత్కంఠగా మారింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో కమిటీల కూర్పు విషయంలో కీలక చర్చలు జరుగుతున్నాయి.

TDP National President : టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ప్రస్తుతం టీపీసీసీ (TPCC) కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు వంటి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు, ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గానికి చెందినవారుగా ఉన్నప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల స్థాయిలో సామాజిక సమతుల్యత పాటించాలనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో మొత్తం పదవుల సంఖ్యను జనాభా శాతానికి అనుగుణంగా కేటాయించాలని, ఇది కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయతను పెంచే అంశంగా కూడా చెబుతున్నారు. ఏఐసీసీ సూచనలతో పాటు రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, సామాజిక న్యాయం జరిగేలా కమిటీలను కూర్చాలని ఆర్గ్యుమెంట్ కొనసాగుతోంది.

Mahanadu : మహానాడు వేదిక సాక్షిగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన బాబు

ఇక కుల గణన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో బీసీలు (ముస్లిం బీసీలతో కలిపి) 56%కి పైగా ఉన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు సుమారు 15% ఉన్నారు. ఈ ఆధారంగా పార్టీలో సామాజిక సమీకరణాలు ప్రతిఫలించకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుల సంఘాలు, ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేయవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయంగా కత్తి మీద సామవుగా మారింది. కుల గణనలో ఆధునికత చూపిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ గణాంకాల ప్రకారమే పార్టీలో సామాజిక న్యాయం చేస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Exit mobile version