ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebration) వేదికగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన ఏడాదిన్నర రాజకీయ మౌనాన్ని చీల్చుతూ మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, పోలీస్ అధికారులకు కూడా బలమైన హెచ్చరికలు పంపారు. అధికార పార్టీని భవిష్యత్తులో కఠినంగా ఎదుర్కొనే సంకేతాలు ఇస్తూ కేసీఆర్ తనదైన ధాటితో ప్రసంగించారు. ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వానికి గడువు ఇచ్చామని, ఇక మౌనం వీడి, పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు ప్రకటించారు.
Supreme Court : కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు
హైడ్రా ప్రాజెక్ట్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం లాంటి విషయాల్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తిరిగి రంగంలోకి రావడం తో రేవంత్ ప్రభుత్వం గట్టి ఒత్తిడిని ఎదుర్కొనబోతోంది. అయితే బీఆర్ఎస్ నిర్వహించిన సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందా లేదా పార్టీకి ఉన్న మద్దతుని సూచిస్తుందా అన్నదానిపై రాజకీయ విశ్లేషణ కొనసాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయాలనే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకురావాలని చూస్తోంది.
కేసీఆర్ కుటుంబం ఇప్పటికే వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో ఉంది. కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కవితపై లిక్కర్ స్కాం కేసు, ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారాల వంటి ఘటనలు అధికార పక్షానికి బలం ఇస్తున్నప్పటికీ, కేసీఆర్ మళ్లీ ప్రజా మద్దతును సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) ఇచ్చిన ఎన్నికల హామీలు ఓ భారంగా మారుతుండడంతో, ప్రతి తప్పటడుగు బీఆర్ఎస్‌కు అవకాశంగా మారే అవకాశం ఉంది. దీనితో బీఆర్ఎస్ ఓపికగా ఎదురు చూసి, సరైన సమయంలో దూకుడు చూపించే వ్యూహం రచిస్తోంది. మరి బిఆర్ఎస్ దూకుడు కు రేవంత్ ఇలా ఎదురుకుంటాడో చూడాలి.