Site icon HashtagU Telugu

Telangana: కేసీఆర్‌ను ప్రజలు కచ్చితంగా వదిలిపెట్టరు: రేవంత్

Telangana

Telangana

Telangana: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆదివారం నారాయణపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ మాట్లాడుతూ… నారాయణపేట గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పారు. 60 ఏళ్ల కళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ రుణం తీర్చుకుందన్నారు. రాష్ట్రం వస్తే అభివృద్ధి జరుగుతుందన్న నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని రేవంత్ అన్నారు.

ఒకప్పుడు రాజేందర్ రెడ్డిని నన్ను లవకుశలు అని పిలిచేవారు. కానీ ఇప్పుడు తాను నమ్మిన నేతలకు ద్రోహం చేశాడని.. అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తే రైల్వేలైన్ ఎందుకు మంజూరు చేయలేదన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పినట్లు నారాయణపేటను అభివృద్ధి చేసే బాధ్యత నాదేనన్నారు. కొత్త మండలాల ఏర్పాటుపై నా దృష్టికి వచ్చింది… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ మండలాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నన్ను కొట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారని కేసీఆర్ అన్నారని అయితే కేసీఆర్‌ను ప్రజలు కచ్చితంగా వదిలిపెట్టరన్నారు రేవంత్. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్ రూం కట్టిస్తామని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు హామీలను ప్రకటించి అమలు చేస్తుందన్నారు. మొదటి తేదీన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఖాతాల్లో జమ అవుతాయన్నారు, 500కి సిలిండర్ అమలవుతుందని చెప్పారు. అలాగే ఆర్టీసీలో లో ఉచిత ప్రయాణం. షాదీముబారక్, కల్యాణలక్ష్మిలో బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: Salaar T Shirt : మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్..ధర చాల తక్కువే

Exit mobile version