తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు , పలు రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. వారిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తో పాటు మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu), కేసీఆర్ (KCR), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లకు కూడా ఆహ్వానం పంపించినట్లు తెలుస్తుంది. అయితే, కేసీఆర్ హాజరవుతారా లేక కేటీఆర్ వస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వస్తారని చాలామంది అంటున్నారు. ఇదే క్రమంలో రాకపోవచ్చని కూడా మరికొంతమంది చెపుతున్నారు. ఎందుకంటే రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చూసుకొని ఢిల్లీ వెళ్లొచ్చని తెలుస్తుంది, టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేలగా..చంద్రబాబు విధేయుడిగా గతంలో పని చేసిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీ సీఎం జగన్ వద్దామనుకున్నప్పటికీ..ప్రస్తుతం ఏపీలో తూఫాన్ పరిస్థితుల కారణంగా ఏపీ నుంచి మంత్రి బుగ్గన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జనసేన నుండి నాదెండ్ల మనోహర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో మనోహర్ స్పీకర్ గా పని చేసిన సమయంలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయించారు.
ఇటు సోనియా , రాహుల్ , ప్రియాంక లను సైతం రేవంత్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరు ముగ్గురు రాబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లోని LB స్టేడియం లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అట్టహాసంగా జరగబోతుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Read Also : Chicken Price : కాంగ్రెస్ గెలుపు సందర్బంగా తక్కువ ధరకే చికెన్ అమ్మకం..
