Kingmaker : 12 లోక్‌సభ సీట్లతో బీఆర్ఎస్ కింగ్‌మేకర్ అవుతుందా ?

Kingmaker : ‘‘మేం పది నుంచి పన్నెండు లోక్‌సభ సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయి’’ అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 07:57 AM IST

Kingmaker : ‘‘మేం పది నుంచి పన్నెండు లోక్‌సభ సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయి’’ అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని అంతటా రిపీట్ చేస్తున్నారు.  ఈ వ్యాఖ్యలతో ప్రజలకు చాలా డౌట్స్ వస్తున్నాయి. 12 లోక్‌సభ సీట్లు అంత పవర్ ఫులా ? వాటి ఎఫెక్టుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్(Kingmaker) ప్రభావితం చేయగలుగుతుందా ? కేంద్రంలో కింగ్ మేకర్‌గా మారి చక్రం తిప్పగలుగుతుందా ?   ఈ అంశాలపై ఓ లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌ను ఘోరంగా దెబ్బతీశాయి. పదేళ్ల పాలనా కాలం తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పతనావస్థను చూసింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్‌లో చేరే వారే తప్ప.. బయటికి వెళ్లే నాయకుడు కనిపించలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం వెలువడుతున్న సమయం నుంచే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం మొదలైపోయింది. రాజకీయ నాయకులు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి చేరిపోవడం షురూ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా జరిగే తతంగం ఇదే !!  నేతల వలసలతో ఒక్కసారిగా కుదుపుకు గురైన బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 గెలవడం అంటే పెద్ద టార్గెటే. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా 17 లోక్‌సభ స్థానాల్లో 14 సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ దూకుడులో ఉంది. అయినా 14 సీట్ల టార్గెట్‌కు పరిమితమైంది. మిగతా మూడు చోట్ల ఇతరులు గెలవొచ్చని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతమున్న కష్టకాలంలో బీఆర్ఎస్ వ్యూహం తప్పేం కాదని.. 12 లోక్‌సభ సీట్ల టార్గెట్‌ను పెట్టుకుంటే కనీసం 5 స్థానాలైనా గెలవడానికి ఛాన్స్ ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Also Read :CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్

తమకు 12 లోక్‌సభ సీట్లు  వస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కాపాడుతామని, రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డం పడతామని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్దసంఖ్యలో లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బిల్లును కూడా అడ్డుకోలేకపోయింది. కేవలం నిరసన తెలపడం, వాకౌట్ చేయడం మాత్రమే బీఆర్ఎస్ చేయగలిగింది. సారు .. కారు..  పదహారు అనే నినాదంతో గత లోక్‌సభ ఎన్నికల్లో జనంలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి  9 లోక్‌సభ సీట్లే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 12 సీట్ల టార్గెట్‌లో ఐదుకు మించి బీఆర్ఎస్ సాధించలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ స్కాంలో కవిత..

ఇక కేంద్రంలో కింగ్ మేకర్ కావాలనే ఆశ ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు.. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్, బీఎస్పీ వంటి పార్టీలకు కూడా ఉంది.  కాబట్టి జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీయో కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు లేదు. ఒకవేళ బీఆర్ఎస్ కింగ్ మేకర్‌గా మారే ప్రయత్నం చేస్తే.. అది దాని ఉనికికే ముప్పు తెస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బలమైన శత్రువుగా బీజేపీ కూడా ఎదుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసినా.. బీజేపీతో కలిసినా.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం మొదలవుతుంది. రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి నడవాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో సంకీర్ణ శకం దిశగా బీజం పడుతుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ప్రస్తుత తరుణంలో ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ తప్పకుండా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరడం కన్ఫామ్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read : Janasena : అల్లు అర్జున్ కూడా గ్లాస్ పట్టుకున్నాడు..ఇక తగ్గేదెలా