Site icon HashtagU Telugu

Vijaya Dairy : విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? తేల్చే పనిలో తెలంగాణ సర్కారు

Vijaya Dairy Telangana Government

Vijaya Dairy : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు విజయ డెయిరీ‌పై  ఫోకస్ పెట్టింది. విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన విజయ డెయిరీ(Vijaya Dairy) టెండర్లలో ఏదైనా గోల్‌మాల్ జరిగిందా ? అనేది తేల్చే పనిలో సీఎం  రేవంత్ ప్రభుత్వం ఉంది. దీనిపై ఇప్పటికే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయ డెయిరీకి పాలుపోసే పాడి రైతులకు బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న బిల్లు బకాయిలు ఎన్ని ?  ఎందుకు బిల్లులను చెల్లించలేదు ? వాళ్లకు అందించాల్సిన  ప్రోత్సాహకాలను ఎందుకు విడుదల చేయలేదు ? అనేది తెలుసుకునే దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది.

Also Read :Hydra : కూకట్‌పల్లి నల్లచెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ఒక మంత్రి..  ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆస్పత్రులకు టెండర్లు లేకుండానే పాలను సప్లై చేయించారని సీఎం రేవంత్‌కు కంప్లయింట్స్ అందాయట. సదరు మంత్రి తన కుటుంబసభ్యులతో ఒక ప్రైవేటు డెయిరీని నడిపించారనే  ఆరోపణలు వచ్చాయట. వీటన్నింటిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సమగ్ర విచారణ చేయిస్తోంది.

Also Read :Al Jazeera : కెమెరాలు తీసుకొని.. ఆఫీసు మూసేసి వెళ్లిపోండి.. అల్ జజీరాకు ఇజ్రాయెల్ వార్నింగ్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కుటుంబ సభ్యుల్లో విజయ డెయిరీ నుంచి కాంట్రాక్టును దక్కించుకున్నది ఎవరు అనేది తేల్చే పనిలో రాష్ట్ర అధికారులు ఉన్నారు. పశు సంవర్ధక శాఖలో ఇలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాలు జరిగేలా ఒత్తిడి తెచ్చిందెవరు అనేది కూడా విచారణలో తేలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో విజయ డెయిరీ వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి? అందుకు దారి తీసిన కారణాలేంటి? అందులో ఎవరెవరి ప్రమేయమున్నది?  అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్‌లో మరో కుదుపు ఏర్పడనుంది.

Also Read :Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోన‌స్ ఎంతంటే..?