Site icon HashtagU Telugu

Ind – Pak War : పాకిస్తాన్ యుద్ధం ఎందుకు ఆపేశారో చెప్పాలి ..? కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

Revanth Bjp Pak

Revanth Bjp Pak

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) పాకిస్తాన్‌తో యుద్ధం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ జైహింద్ యాత్ర సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేంద్రం పాక్‌తో యుద్ధాన్ని ఎందుకు ఆపేసిందో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయంతో యుద్ధాన్ని ఆపేశారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ సూచించినప్పటికీ, మోదీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసిందో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

Mahanadu : కడప గడ్డ పై చంద్రబాబు మాస్ వార్నింగ్

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దేశ భద్రతకు అంకితమై పనిచేస్తుందని, సైనికులకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని అన్నారు. చైనా, పాకిస్తాన్‌లకు ధీటైన జవాబు చెప్పే ధైర్యం కాంగ్రెస్ నేతల్లో మాత్రమే ఉందన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాక్‌ను ఓడించి, అమెరికా హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. “చైనా, పాక్‌లను ఓడించినందుకు కాంగ్రెస్‌ను విమర్శించడమేనా? దేశ భద్రత గురించి చర్చలు లేకుండా యుద్ధం ఆపేసిన మోదీ వివరణ ఇవ్వాలి,” అని రేవంత్ డిమాండ్ చేశారు.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కార్యకర్తల సాహసాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్, దేశ రక్షణకు అవసరమైనప్పుడు తెలంగాణ కూడా ముందుండే అవకాశాన్ని ఉపయోగించుకుంటుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి తెలంగాణలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించిందని తెలిపారు. తిరంగా ర్యాలీలు చేసి జాతిప్రేమను చూపిస్తున్న బీజేపీ, నిజంగా యుద్ధ పరిస్థితుల్లో ఎలా స్పందించిందో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఎన్ని యుద్ధవిమానాలను పాక్ కూల్చిందో మోదీ చెప్పాలి. ప్రధాని మోదీ ఓ రద్దైన వెయ్యి నోటుతో దేశాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Read Also : Gaddar Awards : బన్నీ కి గద్దర్ అవార్డు..చిరు ట్వీట్ అందరికి షాక్