Hydra : హైడ్రా నిర్ణయంపై కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు: ఈటెల రాజేందర్

Hydra : బాజాప్త అనుమతులు తీసుకొని పేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చే అధికారం ఎవరిచ్చారు రేవంత్ రెడ్డి.. ప్రజల కడుపును కొట్టడం ప్రజా పాలననా రేవంత్ రెడ్డి అని ఈటల ప్రశ్నించారు.

Published By: HashtagU Telugu Desk
Why Cabinet did not discuss Hydra decision: Etela Rajender

Why Cabinet did not discuss Hydra decision: Etela Rajender

Etela Rajender : హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. హైడ్రా వల్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. హైడ్రాతో రేవంత్ రెడ్డి రాజకీయ నాటకం మొదలు పెట్టారు అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా నిర్ణయంపై కేబినెట్ లో ఎందుకు చర్చిందలేదు. ప్రతిపక్షాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు.. ప్రజల ఇండ్లను కూల్చివేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు.. బాజాప్త అనుమతులు తీసుకొని పేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చే అధికారం ఎవరిచ్చారు రేవంత్ రెడ్డి.. ప్రజల కడుపును కొట్టడం ప్రజా పాలననా రేవంత్ రెడ్డి అని ఈటల ప్రశ్నించారు.

Read Also:Hydraa : ముందు హైడ్రా..GHMC ఆఫీసులను కూల్చాలని కేటీఆర్ డిమాండ్

కాగా, హైడ్రాను హై కోర్టు తప్పు పట్టింది. శనివారం ఆదివారం కూల్చివేతకు అధికారం లేదని హై కోర్టు చెప్పింది అది ప్రభుత్వానికి చెంప పెట్టు. కూల్చిన ప్రతి దగ్గరకి వెళ్లి ప్రజల గోడును కళ్ళారా చూస్తున్న కడుపు తరుక్కుపోతోంది. జాలీ, దయ, కనికరం లేకుండా హైడ్రా అధికారులు ప్రజలపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. శత్రు దేశంపై దాడి చేసినట్టు దాడి చేస్తున్నారు, ఇంట్లో సామాన్లు తీసుకుంటామన్న సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కూల్చి వేతలతో బడా వేత్తలను బయపెట్టించి వసూళ్లు చేసి, ఢిల్లీకి కప్పం కట్టడం తప్ప మరోకటి లేదు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళనపై బహిరంగ చర్చకు రావాలి. మూసి బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని ఈటల పేర్కొన్నారు.

Read Also: Delhi : కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

  Last Updated: 30 Sep 2024, 07:07 PM IST