తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి(Telangana BJP Chief)గా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు(Ramchander Rao)ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ నిర్ణయం పార్టీలో ఊహించని పరిణామంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి రాంచందర్‌రావు ఎంపిక అవడం రాజకీయంగా కీలకమైన సందేశాలను ఇస్తోంది. ప్రత్యేకించి పార్టీ సైద్ధాంతిక వ్యూహాలపై అవగాహన ఉన్నవారికే పదవులు కట్టబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆయనను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Suicide : కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ పేరు మొదటి నుంచి బలంగా వినిపించినా, చివరికి కేంద్రం ముండిచేయి ఇచ్చింది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటల చేసిన ఢిల్లీ ఫిర్యాదులు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చోటుచేసుకున్న వివాదాలు, ఆయనకు అవకాశం రాకుండా చేశాయని ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ అధిష్ఠానం బీసీ సామాజిక వర్గానికి సీఎం అవకాశం ఉంటుందని ప్రకటించడంతో, అధ్యక్ష పదవిని ఇతర సామాజిక వర్గానికి కేటాయించే వ్యూహం తీసుకుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
Reactor Blast: పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు..
రాంచందర్‌రావు ఎంపికతో బీజేపీ సంఘ్ అనుబంధవర్గాలకు, వేటరన్ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతం ఇచ్చింది. ఆయన విద్యార్థి దశ నుంచి పార్టీకి సేవలందించిన నేతగా, అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, తాత్కాలిక ప్రభావాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో రాంచందర్‌రావు పాత్ర కీలకంగా మారనుంది.