Site icon HashtagU Telugu

Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం

Rajalinga Murthy Murder Political Debate Brs Congress Jayashankar Bhupalpally

Rajalinga Murthy : భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త 47 ఏళ్ల నాగవెళ్లి రాజలింగ మూర్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఎందుకంటే.. రాజలింగ మూర్తికి ఒక కీలకమైన వీఐపీ అంశంతో సంబంధముంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ రాజలింగమూర్తి గతంలో కేసు వేశారు. ఇది హైకోర్టులో గురువారం (ఫిబ్రవరి 20) విచారణకు రానుంది. ఈ విచారణకు సరిగ్గా ఒక రోజు ముందు(బుధవారం) రాత్రి  రాజలింగ మూర్తి మర్డర్ జరగడం రాజకీయంగా కలకలం రేపింది. దీన్ని తెలంగాణలోని అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు స్పందించాయి.

Also Read :APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు

రాజలింగ మూర్తి భార్య ఏం చెప్పిందంటే.. సీఎం సీరియస్

తన భర్త హత్యకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్​ బుర్ర చంద్రయ్య,  మాజీ కౌన్సిలర్‌ కొత్త హరిబాబు కారణమని రాజలింగ మూర్తి(Rajalinga Murthy) భార్య  సరళ ఆరోపిస్తోంది. కేటీఆర్ అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరుడు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆమె ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజీ కేసులో రూ.10 లక్షలు తీసుకొని, వెనక్కి తగ్గాలని గండ్ర వెంకటరమణారెడ్డి బెదిరిస్తున్నాడని రాజలింగమూర్తి తనతో చెప్పాడని సరళ తెలిపారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా డిమాండ్‌ చేశారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ సైతం సీరియస్ అయ్యారు.  ఈ హత్య వివరాలను తనకు 24 గంటల్లోగా నివేదించాలని పోలీసు అధికారులను రేవంత్ ఆదేశించారు.

Also Read :Meghalaya Earthquake : మేఘాలయ, అసోంలలో భూకంపం.. జనం బెంబేలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి.. 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..  ‘‘రాజలింగమూర్తి హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి పాత్ర ఉంది. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలి’’ అని కోరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాజలింగమూర్తి హత్యతో బీఆర్ఎస్ పార్టీకి కానీ, నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. కాగా, రాజలింగ మూర్తి  హత్యకు భూ వివాదాలు కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది.