Maoist Committee : మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు గత రెండేళ్లలో వేగాన్ని పుంజుకున్నాయి. వందలాది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రల పరిధిలో పెద్దసంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. తెలంగాణపై ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ టార్గెట్‌గా తదుపరి ఎన్‌కౌంటర్లు ఉంటాయని అంటున్నారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు, గ్రేహౌండ్స్ విభాగం, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
Also Read :MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ
తెలంగాణ రాష్ట్ర కమిటీలో..
మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ(Maoist Committee) గురించి ఇప్పుడు లోతుగా స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీలో 95 మందే మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఛత్తీస్‌గఢ్ వాళ్లు 60 మంది, తెలంగాణ వాళ్లు 25 మంది, ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారట. తెలంగాణ వాళ్లలో ఎక్కువ మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారే. తెలంగాణ రాష్ట్ర కమిటీలోని భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు (బీకే–ఏఎస్‌ఆర్)డివిజన్ కమిటీ బలంగా ఉంది. రాష్ట్ర కమిటీలోని దాదాపు సగం మంది సభ్యులు ఇందులోనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ వాళ్లలో ఎక్కువ మంది బీజాపూర్, సుక్మా, బస్తర్ ప్రాంతాల వారే. ఛత్తీస్‌గఢ్ వాళ్లు అత్యధికంగా ఉండటంతో మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యకలాపాలన్నీ తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లోని అడవుల నుంచే జరుగుతున్నట్లు గుర్తించారు. అందుకే ఆ అడవులపై భద్రత బలగాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయట. డ్రోన్లతో నిఘా పెట్టారని తెలిసింది.
Also Read :Bathukamma Kunta : మళ్లీ జీవం పోసుకున్న “బతుకమ్మ కుంట”
గ్రేహౌండ్స్ సిబ్బందితో వ్యూహం
గ్రేహౌండ్స్ సిబ్బంది అంటేనే మావోయిస్టులకు హడల్. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో వీరిదేే కీలక పాత్ర. మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏరివేత కోసం చేపట్టనున్న ఆపరేషన్లలోనూ గ్రేహౌండ్స్ విభాగమే కీలక పాత్ర పోషించనుంది. దాని మోహరింపుపై ఇప్పటికే వ్యూహ రచన జరిగిందట. మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీలోని టీమ్‌ల కదలికలు ఉన్న ప్రాంతాలను కచ్చితత్వంతో లొకేట్ చేస్తున్నట్లు తెలిసింది. సరైన ప్రదేశంలో వారిని చుట్టుముట్టాలనే వ్యూహంతో భద్రతా బలగాలు ఉన్నాయి.