Site icon HashtagU Telugu

Special Flights: బేగంపేట ప్లైట్స్ `క‌నికా రెడ్డి` క‌థ ఇదీ.!

Chikoti

Chikoti

తెలుగు రాష్ట్రాల్లోని బ‌డా నేత‌ల భ‌విత‌వ్యం క‌నికారెడ్డి గుప్పిట్లో ఉంది. ఆమె ఈడీ ఎదుట నోరు తెరిస్తే లిక్క‌ర్ భాగోతంతో పాటు కాసినో క‌థ క్లైమాక్స్ కు వ‌స్తుంది. ఫ‌లితంగా కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల చీక‌టి కోణాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. అంత‌టి ప్రాధాన్యం ఉన్న ఆ క‌నికా రెడ్డి ఎవ‌రు? ఆమె ప్రొఫైల్ ఏమిటి? అనేది గ‌మ‌నిస్తే మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఉమెన్ క‌నిపిస్తారు.

క‌నికా రెడ్డి అలియాస్ క‌నిక టేక్రివాల్ వ‌య‌స్సు నిండా 33 ఏళ్లు. ఆమె నికర విలువ ₹420 కోట్లతో ప్రోత్సాహకాలను ఇస్తూ యువ వ్యాపారవేత్తలకు ఉన్న అపారమైన అవకాశాలను తెలియజేస్తుంటారు. కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురూన్ సంపన్న మహిళల జాబితా 2021లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలు. భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) క్యాంపస్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ స్కూల్ పూర్వ విద్యార్థిని కనిక ఈ ఏడాది హైదరాబాద్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.


Also Read:  TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్‌?

క్యాన్స ర్ ను అధిగ‌మించిన భోపాల్‌లోని మార్వాడీ కుటుంబంలో కనికా టేక్రివాల్ జ‌న్మించారు. ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్ చార్టర్‌ల కోసం భారతదేశంలో మొట్టమొదటి మార్కెట్‌ను స్థాపించారు. గత కొన్నేళ్ల‌లో ఆమె విమానయాన సంస్థ జెట్‌సెట్‌గో 10 ప్రైవేట్ జెట్‌లను సొంతం చేసుకుంది. ప్రైవేట్ జెట్ , హెలికాప్టర్ సేవలను అందించడానికి కనికా 2012లో జెట్‌సెట్‌గోను ఏవియేషన్ స్టార్టప్‌గా ప్రారంభించింది. ప్ర‌స్తుతం JetSetGo ప్రైవేట్ జెట్ , హెలికాప్టర్ చార్టర్ కోసం భారతదేశంలోని మొట్టమొదటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ గా పేరొందింది.

ఆమెకు తెలుగు రాష్ట్రాల్లోని అధికారిక కుటుంబంలోని కొంద‌రు స‌భ్యుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేక విమానాలు, చార్ట‌ర్డ్ ఫైట్స్ , హెలికాప్ట‌ర్ల‌ను అందించ‌డం ద్వారా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. పైగా ఆమె ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడికి స్వ‌యానా వ‌దిన అవుతారు. దీంతో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నుంచి చికోటి ప్ర‌వీణ్ క్యాసినో డీల్ కోసం న‌డిచిన బ్లాక్ మ‌నీ లావాదేవీల‌కు ప్ర‌త్యేక విమానాల‌ను అందించిన మ‌హిళ‌గా కేంద్ర బిందువు అయ్యారు.

Also Read:  Jagga Reddy: సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు థ్యాంక్స్ చెప్పిన ‘జగ్గారెడ్డి’