Who is Charles Shobharaj : ఉచిత విద్యుత్ మీద నోరుజారిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి రాజకీయ దాడికి దిగారు. ప్రతిగాచార్లెస్ శోభారాజ్ తో పోల్చుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఆరోపణలు గుప్పించారు. ఎవరీ చార్లెస్ శోభారాజ్? ఎందుకు అతనితో కేసీఆర్ పోల్చారు? అనే ప్రశ్నలు వేసుకుంటోన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే, చార్లెస్ శోభరాజ్ ఎవరో తెలిసిన బీఆర్ఎస్ లీడర్, విద్యావేత్త దాసోజు శ్రావణ్ మీడియా ముందుకొచ్చారు. మరో నయీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోల్చుతూ పలు ఆరోపణలు చేశారు. దీంతో నయీం పెద్ద నేరస్తుడా? చార్లెస్ శోభారాజ్ కరుడుకట్టిన నేరగాడా? అనే దానిపై తెలంగాణ సమాజం చర్చ మొదలు పెట్టింది.
శోభారాజ్ తో పోల్చుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఆరోపణలు(Who is Charles Shobharaj )
పోలీస్ ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ డాన్ నయీం సంగతి సర్వత్రా తెలిసిందే. అయితే, చార్లెస్ శోభారాజ్ (Who is Charles Shobharaj )గురించి చాలా మంది తెలియకపోవచ్చు. గుగూల్ వెదికితే, ఆయన అంతర్జాతీయ నేరస్తుడని అర్థమవుతోంది. సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ గా శోభారాజ్ కు పేరుంది. అంతటి కరుడుగట్టిన నేరస్తునితో కేసీఆర్ ను పోల్చడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. ఇంతకూ చార్లెస్ శోభారాజ్ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే, అతడి వాల్ల బాధపడిన కుటుంబాలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతారు. అతడి నేర ప్రవృత్తి గురించి పూర్తిగా తెలియని వాళ్లు మాత్రం సెలబ్రిటీలా భావిస్తారు. అయితే అతడో సీరియల్ కిల్లర్ అని.. తొమ్మిది దేశాల పోలీసులు అతడి కోసం గాలించారని ప్రస్తుత తరానికి తెలియదు. తొమ్మిది దేశాల్లో హత్యలు చేసిన చార్లెస్ శోభరాజు, గత 19 ఏళ్లుగా హత్యా నేరం కింద నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుడు కావడంతో నేపాల్ కోర్టు అతడి విడుదల చేసింది.
1963 లో పారిస్ సమీపంలోని పాయిసీ జైలులో మొదటి జైలు శిక్ష
భారత పౌరుడికి, వియాత్నం మహిళకు 1944, ఏప్రిల్ 6న జన్మించాడు. అతడి పూర్తి పేరు హాత్‌చంద్ భావ్‌నాని గురుముఖ్ చార్లెస్ శోభరాజ్.(Who is Charles Shobharaj ). అతడు జన్మించిన కొన్నాళ్లకు తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత చార్లెస్ తల్లి ఓ ఫ్రెంచ్ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడు చార్లెస్‌ని దత్తత తీసుకున్నాడు. కానీ వారికి సంతానం కలిగిన తర్వాత.. చార్లెస్‌ను నిర్లక్ష్యం చేయసాగారు. దాంతో అతడు బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ సంఘటనలు అతడి మనసుపై తీవ్ర ప్రభావం చూపి నేర ప్రపంచంవైపు అతడి అడుగులు పడేలా చేశాయి. చిన్న చిన్న నేరాలకు పాల్పడతూ తొలిసారి దోపిడికి సంబంధించి 1963 లో పారిస్ సమీపంలోని పాయిసీ జైలులో తన మొదటి జైలు శిక్ష అనుభవించాడు.
9 దేశాల్లో నేరాలు..
1963 నుంచి అతడి నేర జీవితం ప్రారంభం అయ్యింది. ఇక శోభరాజ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవాలని భావించారు. కానీ సరిగ్గా పెళ్లి రోజే దొంగిలించిన కారులో తిరుగుతూ పట్టుబడి జైలుకు వెళ్లాడు. అలా ఆ పెళ్లి ఆగిపోయింది. కానీ అతడి గర్ల్‌ఫ్రెండ్ మాత్రం చార్లెస్ (Who is Charles Shobharaj ) కోసం ఎదరుచూడసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా శోభరాజు తన నేర ప్రవృత్తిని వదులుకోలేదు. పైగా నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 9 దేశాల్లో నేరాలకు పాల్పడ్డాడు. వీటిల్లో భారతదేశం కూడా ఉంది.
బికినీ ధరించిన యువతులే టార్గెట్ (Who is Charles Shobharaj )
భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులు కన్ను గప్పడం వారికి లంచాలు ఎర వేసి పారిపోవడంలో చార్లెస్ సిద్ధహస్తుడు. పోలీసుల వల నుంచి పాములా జారి పోయేవాడు అని ప్రసిద్ధి. ఇక తన నేరాలకు సంబంధించి చార్లెస్ నాలుగు దేశాల్లో మాత్రమే ఎక్కువకాలం ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు. చార్లెస్‌కు బికినీ కిల్లర్ అనే పేరుంది. 70వ దశకంలో చార్లెస్ ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో పొడవడం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో సజీవదహనం ద్వారా బాధితులకు దగ్గరయ్యి వారిని హత్య చేసేవాడు. బీచ్‌లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. దీంతో చార్లెస్‌ను(Who is Charles Shobharaj ) బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.
20కి పైగా హత్యలు..
చార్లెస్ తన జీవితంలో 20కి పైగా హత్యలకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్ టూరిస్ట్‌కు విషం ఇచ్చి చంపినందుకుగాను అతను 21 సంవత్సరాలు భారతీయ జైలులో ఉన్నాడు. 1997 ఫిబ్రవరి 17 న, 52 వ ఏట చార్లెస్ విడుదలయ్యాడు. అతడిపై ఉన్న అనేక వారెంట్లు, సాక్ష్యాలు, అతనికి వ్యతిరేకంగా సాక్షులు కూడా లేకుండా పోయారు. అతడిని అప్పగించడానికి ఏ దేశమూ లేనందున, భారత అధికారులు అతడిని ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లనిచ్చారు. ఫ్రాన్స్‌లో చార్లెస్ సెలబ్రిటీ హోదా అనుభవించాడు. ఆ తర్వాత 2003లో ఖాట్మండులోని ఓ క్యాసినోలో కనిపించిన అతడిని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. 1975లో నేపాల్‌లో అమెరికన్ టూరిస్ట్ అయిన కొన్నీ జో బ్రోంజిచ్ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. 2014లో అతను కెనడియన్ బ్యాక్‌ప్యాకర్ లారెంట్ క్యారియర్ హత్య కేసులో దోషిగా (Who is Charles Shobharaj )నిర్ధారించబడ్డాడు. దాంతో కోర్టు రెండవ జీవిత ఖైదు విధించింది.
Also Read : Political Civil Code : కాంగ్రెస్ వైపు KCR అడుగు
జైల్లో ఉండగానే చార్లెస్ శోభరాజు 2008లో నేపాలీ మహిళ నిహిత బిశ్వాస్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా శోభరాజ్ తనకు విధించిన శిక్షలకు సంబంధించి నిర్దేశించిన దానికంటే ఎక్కువ కాలం జైలులో గడిపానని వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల దృష్టా తనను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నేపాల్‌లో 75 శాతం శిక్ష అనుభవించిన ఖైదీలు జైలులో మంచి ప్రవర్తనతో మెలిగితే వారిని విడుదల చేసేందుకు చట్టపరమైన నిబంధన ఉంది. నేపాల్‌లోని సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చిన ‘సడలింపు’ ప్రకారం తాను జైలు శిక్షను పూర్తి చేశానని తన పిటిషన్‌లో శోభరాజ్ పేర్కొన్నాడు. 20 సంవత్సరాల జైలు శిక్షలో ఇప్పటికే 17 సంవత్సరాలు గడిపానని ఇక తన వయసు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చార్లెస్ (Who is Charles Shobharaj )పిటిషన్‌ను విచారించిన కోర్టు అతడిపై పెండింగ్ కేసులేవి లేకపోతే బుధవారమే అతడిని విడుదల చేసి 15 రోజుల్లోగా అతడి దేశానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
చార్లెస్ శోభరాజ్ జీవితంపై సినిమా..
రణదీప్ హుడా నటించిన ‘మెయిన్ ఔర్ చార్లెస్’ చిత్రం శోభరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఆ సమయంలో నటుడు కిల్లర్‌ని కూడా జైలులో కలిశాడు. ఈ చిత్రంలో శోభరాజ్ పాత్రను రణదీప్ హుడా పోషించాడు. ఈ చిత్రం 30 అక్టోబర్ 2015న విడుదలైంది. ఇతడి జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. 9 దేశాల పోలీసులను పరుగులు పెట్టించిన చార్లెస్ శోభరాజు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడితో తెలంగాణ సీఎం కేసీఆర్ ను పీసీసీ చీఫ్ పోల్చడం శోచనీయం.
Also Read : BRS Tickets: బీఆర్ఎస్ లో టికెట్ల ఇష్యూ, ఆ 25 నియోజకవర్గాలో బిగ్ ఫైట్!