Site icon HashtagU Telugu

Where Is Raj Pakala: రాజ్ పాకాల ఎక్క‌డ‌? డ్రగ్స్ డొంక కదులనుందా?

Where Is Raj Pakala

Where Is Raj Pakala

Where Is Raj Pakala: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత బావ‌మ‌రిది రాజ్ పాకాల (Where Is Raj Pakala) గురించి పోలీసులు తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజ్ పాకాలా అధికారుల కళ్లుగప్పి పారిపోయిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ముందస్తు సమాచారంతో పార్టీ నుంచి వెళ్లిపోయాడ‌ని తెలుస్తోంది. అంతేకాకుండా అడ్రస్ తెలియకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకున్న‌ట్లు పోలీస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్ పాకాల హైదరాబాద్ లోనే తలదాచుకున్నాడా? లేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.

రాజ్ పాకాల కోసం పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి వేట ప్రారంభించారు. రాజ్ పాకాల దొరికితే కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. రాజ్ పాకాల ఎపిసోడ్ పై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఇంత‌వ‌ర‌కూ రాజ్ పాకాల అడ్రస్ దొరక‌లేదు. రేవ్ పార్టీనా? రావుల పార్టీనా అని BJP ఆరోపిస్తోంది. నిజంగా రావుల పార్టీనే అయితే రాజ్ పాకాల ఎందుకు గాయబ్ అయ్యాడని బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. రాజ్ పాకాల దొరికితే డ్రగ్స్ డొంక కదులుతుంద‌ని తెలుస్తోంది. డ్ర‌గ్ పాజిటివ్‌గా వ‌చ్చిన విజయ్ మద్దూరికి సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. డ్రగ్ మరకలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పార్టీలకు కూడా అంటుకున్నాయనే టాక్ న‌డుస్తోంది. అయితే రాజ్ పాకాల‌తో కొంద‌రి ప్ర‌ముఖుల‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Ayodhya Ram Temple: ప్ర‌పంచ రికార్డు.. అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాలతో దీపావ‌ళి!

కేటీఆర్ చెప్పిన‌ట్లుగా రాజ్ పాకాల‌కు డ్ర‌గ్ టెస్టులో నెగిటివ్ వ‌స్తే ఎందుకు పారిపోయాడ‌నేది ప్ర‌శ్న‌. విజయ్ మ‌ద్దూరి కూడా పోలీసులు అన్ని అవాస్త‌వాలే అని అంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ నాయ‌కులు ఇది ఖచ్చితంగా డ్ర‌గ్స్ పార్టీనే అని ఆరోపిస్తున్నారు. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా కీల‌కంగా ఉంద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి సెర్చ్ వారెంట్ లేకుండా త‌మ బంధువుల ఇళ్ల‌లో ఎందుకు సోదాలు చేస్తున్నారు? వెంట‌నే సోదాలు ఆపాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు ఆదివారం వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఉద‌యం ఎక్సైజ్ కేసు సాయంత్రం క‌ల్లా డ్ర‌గ్స్ కేసుగా ఎలా మారింద‌ని కేటీఆర్ ఆధారాల‌తో స‌హా ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు జ‌న్వాడ పార్టీలో ఏం జ‌రిగింద‌నేది తెలియాలంటే రాజ్ పాకాల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తెలంగాణ రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో వేచి చూడాలి.