Site icon HashtagU Telugu

Congress Promises Scooter Scheme : యువతులకు స్కూటీలెక్కడ? – BRS ఎమ్మెల్సీలు

Congress Promises Scooter S

Congress Promises Scooter S

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana assembly meetings) సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను (Congress Promises) అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఉచితంగా ( Scooter Scheme) అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆ హామీ అమలవలేదని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కవిత, మధుసూదనాచారి, మహ్మూద్ అలీ, సత్యవతి రాథోడ్లు మండలి వద్ద వినూత్న నిరసన చేపట్టారు.

Gates Foundation: రేపు బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. జరగబోయే ఒప్పందాలివే

ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్కూటీ ఆకారంలోని కటౌట్లతో నిరసన తెలియజేశారు. ‘18 ఏళ్లు నిండిన యువతులకు ఉచిత స్కూటీలు ఎక్కడ?’ అనే ప్రశ్నను పెదవి విరిచారు. గతంలో కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

స్కూటీ స్కీమ్ మాత్రమే కాకుండా, మిర్చి రైతులకు తగిన మద్దతు లభించలేదని కూడా బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మిర్చి రైతులకు మద్దతుగా ఎండుమిర్చి దండలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని చెప్పిన మాటలు, యువతకు ఇచ్చిన హామీలు అన్నీ గాలికొదిలేసినట్లే అయ్యాయని నేతలు మండిపడ్డారు. తమ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.