Site icon HashtagU Telugu

KTR: ఉప ఎన్నికల్లో 100 కోట్ల ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్

KTR

New Web Story Copy 2023 07 09t165006.340

KTR: తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ రెండు పార్టీలు రాజకీయంగా హాట్ హాట్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు. శనివారం ప్రధాని మోడీ వరంగల్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా మోడీ అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీగా ముద్ర వేశారు మోడీ. ఇక వరంగల్ బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ కెసిఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు ఖర్చు చేసినట్టు ఆరోపణలు చేసింది. అయితే బీజేపీ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

బీజేపీ చేసిన ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు విచారణ చేయడం లేదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని బీజేపీ చెబుతున్నప్పుడు ఈసీ, ఈడీ, ఐటీ ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు కేటీఆర్.

Read More: CCTV Cameras: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రేపు హైకోర్టులో విచారణ